పుట:Naajeevitayatrat021599mbp.pdf/759

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కూలతలు ప్రారంభమై, కొన్ని సమయాలలో మంత్రివర్గాలకు చేటును గూడా కలిగిస్తాయి.

ఇన్ని కారణాలవల్ల, పార్లమెంటరీ సెక్రటరీల వ్యవస్థ అంతరించి పోయింది.

అయితే, కేంద్రప్రభుత్వంలో ఇటువంటి దుస్థితి కొంచెం కొందరు డెప్యూటి మంత్రుల విషయంలో ఉండడం కద్దు.

సామాన్య ప్రజానీకానికి మాత్రం, గవర్నమెంటు అనగా మంత్రివర్గం నుంచిగాని, గవర్నరువద్ద నుంచిగాని ఆర్డరు జారీ అయినట్టు ఉన్న కాగితాలు చూచినపుడు, అవి మంత్రుల అనుమతిపైన, ఎరుకపైననే జారీ అవుతున్నాయనే ఒక భ్రమ కదు.

ఆ కాగితాలు ప్రభుత్వం రహస్యంగా ఉంచడానికి శాసనాధికారం ఉండడంవల్ల, అసలు గుట్టు - ఏ వ్యవహారమైనా కోర్టు కెక్కినపుడుతప్ప, ఎవరికీ తెలియదు.

పరిపాలనలో మరికొన్ని విశేషాలు

మంత్రివర్గం ఏర్పడిన తర్వాత నాడారు వర్గానికి, ప్రకాశంగారి వర్గానికి భేదాలు ఏవీ ఉండవని ఆశించాము. కాని, గాంధీగారు - ప్రకాశంగారితో బాటుగాక, ప్రత్యేకంగా నాడారుగారిని పిలిచిన సాయంత్రం ఏమి బీజం వేశారోగాని, ప్రకాశం నాడారుగార్ల, మధ్య డిల్లీకి వెళ్లేముందున్న సామరస్యం డిల్లీ నుంచి తిరిగివచ్చిన తర్వాత వై మనస్యంగా మారింది. ప్రకాశంగారిలో ఉన్న దోషము లేవో కనిపెట్టడమే నాడారుగారి కార్యక్రమంగా మారింది.

ఇంతేగాక, ఆంధ్రులకు ప్రాముఖ్యం కలగడం తీవ్ర భాషావాదులైన తమిళ సోదరులు కొందరికి నచ్చలేదు. నాయకుని ఎన్నికయిన మరునాటినుంచి సంతోషం చేత ప్రకాశంగారిని అభినందించడానికి, తెలుగు జిల్లాలోంచి, ముఖ్యంగా గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలనుంచి వచ్చి, ఫోర్టు సెంట్ జార్జిలో సచివాలయం నిండుగా మెండుకొనే ప్రేక్షక తరంగాలు - ఒక నూతన ఆంధ్రత్వాన్ని, పూర్వం