పుట:Naajeevitayatrat021599mbp.pdf/749

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

న్యాయవిరుద్దంకానిపద్ధతిలో పోవడం ప్రతి ప్రభుత్వానికీ అత్యవసరము."

దేశ పరిస్థితులే ఇటువంటి శాసనాలకు మూలకారణము. కాంగ్రెసు శాసన సభ్యుల పార్టీ సమావేశంలో తర్జన భర్జన కొంత జరిగిన తర్వాత, పటేలుగారి ఉత్తరాన్ని ప్రకాశంగారు చదివి వినిపించగా అందరూ బిల్లును ఆమోదించారు. శాసన సభలో, ప్రతిపక్షులు సంప్రదాయానుసారం అభ్యంతరాలు చెప్పినా, మొత్తంమీద ఆ బిల్లు నిరాటంకంగానే ఆమోదింపబడింది.

రాజాజీ హాలు

పోర్టు సెంట్ జార్జిలో శాసన సభ జరుపుకునేందుకు, 1919 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్టు ఆమోదమయిన తరువాత, ఒక హాలు నిర్మించారు. కాని, అది విస్తృతమైన అప్పటి శాసన సభను జరపడానికి ఎంత మాత్రమూ చాలదు. అది అలా ఉండగా, అప్పటికి శాసన సభ్యులకు సరి అయిన వసతి గృహాలు లేవు.

నగరంలో మౌంటురోడ్డు నానుకొని గవర్నరుగారి బంగళా ఆవరణ ఉండేది.

యుద్ధానంతరం గవర్నరు ఆ బంగళాలో నివసించేవారు కారు. చెన్నపట్నానికి ఎనిమిది, తొమ్మిది మైళ్ళ దూరంలో ఉండే గిండీలో నివసించేవారు.

ఇక్కడ గవర్నరు బంగళాను ఆనుకొని - విందులు జరుపుకొనేందుకు పెద్ద పెద్ద స్తంభాలతో ఒక ప్రత్యేకమైన భవనం ఉండేది. శాసన సభ సెనేటు హాల్లో జరుగుతున్నపుడు శాసన మండలి సమావేశాలు ఈ విందుల భవనంలో జరుగుతూండేవి. గవర్నరు ఆవరణ మొత్తం నూట పది ఎకరాలు ఉండేది. యుద్ధకాలంలో గవర్నరుకు దగ్గరగా ఉండవలసిన ఒకరిద్దరికి కూడా చిన్న భవనాలు ఆ ఆవరణలోనే నిర్మింపబడ్డాయి.

ఈ భవనంతో సహా, గవర్నరుగారు తన మౌంటురోడ్డు భవనము, ఆవరణ ప్రభుత్వ ప్రయోజనాలకని ప్రభుత్వానికి అప్పజెప్పాలని,