పుట:Naajeevitayatrat021599mbp.pdf/747

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజునౌతాను? మినిస్టర్ అన్న ఇంగ్లీషు క్రియకు 'ప్రజలకు కావలసిన అవసరాలు తీర్చు' అని అర్థము. అది తీర్చేవాడు మినిస్టరు. మినిస్టరు ప్రజలకు సేవకుడు. ఆ సేవాధర్మం సరిగా నిర్వహించకపోతే, మినిస్టర్లు అవతలికి పోవలసిఉంటుంది. అటువంటి సేవ చేసే సమయంలో మాలో మా కేవైనా భేదాభిప్రాయాలు వస్తే వాటిని సర్దుకొనే సమృద్ధి మాలోనే ఉదయించాలి. కాని, ఈ భేదాల దుష్ప్రభావం పరిపాలనమీద పడకూడదు"

ఈ సందర్భంలో గాంధీగారు, ప్రకాశంగారికి వ్రాసిన ఉత్తరం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అది యిది:

"కేంద్రప్రభుత్వంవారు మీకు, మీ ప్రభుత్వం మరకదుళ్ళు తప్పక తీసుకోవాలి అని వ్రాసిన ఉత్తరం - మీ మీద సవాలు, చర్ఖా (రాట్నం) మీద చేసిన సవాలు, నోరూ వాయీలేని చెన్నరాష్ట్ర ప్రజలపై చేసిన సవాలు. ప్రజలు మీ పక్షమే ఉన్నారని నేను భావిస్తున్నాను. అందుచేత కేంద్రప్రభుత్వంవారు చేసిన సవాలును మీరు అంగీకరించండి. (అంటే, మర కదుళ్ళను తిరస్కరించమని భావము) చెన్నరాష్ట్ర ప్రజలకేగాక, భారతీయ మానవ లోకమంతటికీ మీరు ఉపకారం చేసిన వారవుతారు."

గాంధీగారు తమ స్కీముల విషయమై ఇంత గట్టిగా వ్రాయడంచేతనే, తాము లేకున్నా తమ స్కీములు నడుస్తాయని ప్రకాశంగారు భావించారు.

మొదట్లో ఫిర్కా అభివృద్ధి ఉద్యమం పెద్దదేమోనని గాంధీగారు అభిప్రాయ పడ్డారు. అయితే, ప్రకాశంగారు ఇరవైఐదు ఫిర్కాలలో పని సాగించడం ఒక పెద్ద కష్టం కాదన్నారు. గాంధీగారు తృప్తిపొందారు. తనకు స్కీములు వివరించి చెప్పడానికి వచ్చిన అధికారి (టి. రాఘవరావుగారి)తో, గాంధీగారు, "ప్రకాశంగారి స్కీము అంతా ఇదివరకు ఎవరూ అమలుపరచడానికి పూనుకోలేదు. చెన్నరాష్ట్రం ఈ