పుట:Naajeevitayatrat021599mbp.pdf/740

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ప్రకాశానికి 75 ఏండ్లు. ముసలివాడు, నాకు 28 ఏండ్లే, నన్ను అరెస్టుచేస్తే ఆయన ఎన్నాళ్ళు రాష్ట్రంలో ప్రధానిగా ఉండగలడో చూద్దాము. నేను శాసన సభ్యుణ్ణి, నేను అరెస్టయితే 1942 తిరిగీ ప్రవేశిస్తుంది. అసెంబ్లీలోనే ఆయన్ను చెప్పు పుచ్చుకొని కొడతాను. నేను అరెస్టయితే మృత్యు దేవత భూమిని ఆవరిస్తుంది.

"ఓ, రైనాల్డ్స్! నీవు దక్షిణ ఇండియా రైల్వేకి జనరల్ మేనేజరువి. నీవు జవహర్‌లాల్ నెహ్రూ దగ్గరికి వెళితే తాపులు తింటావు. నీవు ఉరికంబ మెక్కుతావు.

"ఈ అధర్మ కాంగ్రెస్ ప్రభుత్వం నశిస్తుంది. దిక్కులేని కార్మికులు కాల్చబడుతున్నారు. శాసన సభకు కార్మికుల్ని పంపిస్తాము. వారు ప్రకాశంగారి చేతులను కొట్టేస్తారు.

"హిట్లరుకు వ్యతిరేకంగా సోవియట్లు గొరిల్లా యుద్ధం చేశారు. ఆ యుద్ధం ఇటుపై ఇక్కడ సాగుతుంది. సమ్మెను పాడుచేసే కార్మికుడు (నల్లకాలు) ఉంటే, వాడి కాలు ఎర్రబడి పోతుంది.

ఈ విధంగా సమ్మె సాగించేవారిని, తమిళ ప్రాంత కాంగ్రెసు సంఘపు కార్మిక (లేబర్) ఉపసంఘంవారు తమ ధర్మ ప్రకారంగా అన్ని స్థలాలలో వీలైనంతమటుకు ప్రోత్సహిస్తూండేవారు.

అయినప్పటికి ప్రకాశంగారు, కార్మిక నాయకులైన గిరిగారు తిరుచినాపల్లికి వెళ్ళి, మేనేజ్‌మెంటును, కార్మికులను సమావేశపరిచి రాజీ చేసేశారు.

ఇంత పెద్ద సమ్మెలు ప్రకాశంగారు పరిష్కరించినపుడు, కాంగ్రెసులో వ్యతిరేకవర్గానికి సంతృప్తికి మారుగా మరింత మాత్సర్యమే కలిగింది.

బకింగ్‌హామ్ కర్నాటిక్ మిల్లుల సమ్మె సందర్భంగా ఏంథోనీ అనే ఆయన అరెస్టయి ఉండెను. ప్రకాశంగారు, కచేరి గదిలోకి వెళ్ళిన మొదటిరోజునే ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఆయన