పుట:Naajeevitayatrat021599mbp.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాంబశివరావుగారు నేతి సోమయాజులుగారు మొదలైన పెద్దలు చాలామంది ఆయనకి తోడ్పడుతూ వుండేవారు. కాని ఈ పెద్దలంతా ఆ సిద్ధాంతాలు ఆచరణలో పెట్టడానికి సమయం వచ్చినప్పుడు, ఆ సిద్ధాంతాలు ఆయనకి అప్పజెప్పి, తప్పుగున్నవాళ్ళే! ఆ కాలంలోనే నా వివాహంతో బాటు మా చెల్లెలు అన్నపూర్ణ భర్త ఆకస్మికంగా మరణించాడు. పెళ్ళి నాటికే ఆయన పెద్దవాడు. నా చెల్లెలు వ్యక్తురాలు కాకుండానే ఆయన మరణించడంచేత, నాకు రాజమహేంద్రవరంలో కలిగిన సంస్కరణ భావాల వల్ల, ఆమెకి పున ర్వివాహం చేయ్యాలని దృఢసంకల్పం కలిగింది. నే నీ ప్రయత్నంలో వుండగానే ఆమె కూడా చనిపోవడం తటస్థించింది.

యఫ్.ఏ. క్లాసు ఈ విధంగా సాగింది. కేసుల గందరగోళాలతో వుడుకు రక్తం కాస్త చల్లారింది. పైగా, జీవితలక్ష్యం అంతా ప్లీడరీమీద వుండడంచేత చదువుకి ఏమీ ప్రతిబంధకం కలగనియ్యకుండా చూడాలనే దృఢసంకల్పం ఒకటి తోడుపడింది. అందుచేత చదువంటే బాగా శ్రద్ధ పట్టాను. నాటకాల వ్యవహారం మాత్రం ఏమీ తగ్గలేదు. మొత్తంమీద 1891వ సంవత్సరంలో యఫ్.ఏ. పరీక్షకి హాజరై పాసయ్యాను. అప్పట్లో యఫ్.ఏ.పాసయితే ఫస్టుగ్రేడు పరీక్షకి ప్రైవేటుగా చదవవచ్చును. అందుచేత కూడా ఆ లక్ష్యశుద్ధి ఎక్కువైంది.

1892వ సంవత్సరంలో ప్లీడరు పరీక్ష కోసం బాగా క్షుణ్ణంగా చదివాను. అప్పటికి ఏలూరి లక్ష్మీనరసింహంగారు బి.ఏ. పాసయి స్కూలు పెట్టుకుని వున్నారు. ఆయన అప్పటికి మున్సిపల్ చెయిర్మన్ గా వుండి మునిసిపల్ వ్యవహారమంతా ఏకటాకీగా నడిపించేవారు. ఆయన కూడా నాతోబాటు ప్లీడరుపరీక్షకి చదువుతూవుండేవాడు. ఉభయులమూ కలిసి పరీక్షకి చదువుతూ వుండేవాళ్ళము. తీరా చదువంతా పూర్తి అయ్యాక నాకొక విఘ్నం వచ్చింది. 21 సంవత్సరాల వయస్సు పూర్తి అయితేనేగాని ఫస్టుగ్రేడు పరీక్షకి కూర్చోడానికి వీలులేదని ఎక్కడో ఒక నియమం ఉందిట. నేను అది చూసుకోకుండానే చదువు