పుట:Naajeevitayatrat021599mbp.pdf/739

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ తరువాత ప్రకాశంగారు, నేను దక్షిణ జిల్లాలలో పర్యటించినపుడు - ఈ స్కీము వివరాలు వింటూ కొందరు యువకులు, దాన్ని అమలు పరిస్తే తాము కమ్యూనిస్ట్ పార్టీలో చేరబోమని ప్రకాశంగారికి యిచ్చిన విజ్ఞప్తి పత్రాలలో పేర్కొన్నారు.

సమ్మెల పరిష్కారం - ప్రకాశంగారి చాకచక్యము

ప్రకాశంగారు ముఖ్యమంత్రి అయిన వెంటనే, చెన్నపట్నంలో బకింగ్ హామ్ కర్నాటిక్ మిల్లులో పదివేలమంది జరుపుతున్న సమ్మెను, మధురా మిల్లులలో జరుగుతున్న సమ్మెను- అలాగే దక్షిణ ఇండియా రైల్వే లేబరు జరుపుతున్న సమ్మెను - కేవలం తమ వ్యక్తిగతమైన పలుకుబడివల్ల పరిష్కరించ గలిగారు.

దక్షిణ ఇండియా రైల్వే వర్కరుల సమ్మె జరుగుతున్నప్పుడు ప్రకాశంగారి పలుకుబడి తగ్గించేందుకని, రాజాజీ గవర్నరు దగ్గరికి వెళ్ళి-ప్రధాన న్యాయమూర్తి, డాక్టర్ సుబ్బరాయన్, డాక్టర్ రాజన్ గారలు గల ఒక ఉప సంఘం నియమించి, దాని ద్వారా ఆ సమ్మెను పరిష్కరించవలసిందని సలహా ఇచ్చారు. గాంధీగారు లోగడ జరిపిన ఒప్పందం ప్రకారం-గవర్నరు, కేవలం కాన్ట్సిట్యూషనల్ గవర్నరే అని తెలిసీ, రాజాజీ ఆయన దగ్గరికి వెళ్ళడం సరయిన పనికాదు.

గవర్నరు, ప్రకాశంగారితో ఈ విషయం చెప్పగా - ఆయనకీర్తి అయినా, అపకీర్తి అయినా తన బాధ్యతేకాని, ఇతర కమిటీలతో ఎట్టి ప్రమేయమూ పెట్టుకోనని చెప్పారు. ఆ మీదట గవర్నరు ఏమీ కలుగజేసుకోలేదు.

ఈ సమ్మె నాయక వర్గంలో నంబియార్ అనే శాసన సభ్యుడుండేవాడు. ఈ సమ్మెతోపాటు చాలా అల్లరులు, అరెస్టులు జరిగాయి.

అందులో ఒక రోజున ఆ నంబియారు కార్మికులముందు ప్రసంగిస్తూ, ఇలా అన్నాడు: