పుట:Naajeevitayatrat021599mbp.pdf/737

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేషన్ నిబంధనలు గట్టి పరిచి, ఆహార పదార్థాలు వృథాకాకుండా ఉండడానికి గట్టి ఏర్పాట్లు చేయబడ్డాయి. ఆహార పదార్థాలను సేకరించే సంస్థలను పునర్నిర్మించి బలపరిచారు. ఆహారపు దినుసులను సేకరించే అధికారులకు వాటిని అమ్మడం పవిత్రమైన విధి అని రైతులకు బోధపడేటట్టు స్వయంగా ప్రకాశంగారే సమావేశాలలో చెప్పేవారు. డిసెంబరులోగా 3 లక్షల 36 వేల టన్నుల సేకరణ చేయడానికి నిశ్చయించి, ఆ లక్ష్యం సాధించారు. సాంఘిక న్యాయం కోసం, మన రాష్ట్రంలో రేషను ఇచ్చే మొత్తంలో బియ్యం కొంత తగ్గించారు. తక్కువ కాలంలో పండే ధాన్యానికి ఎకరానికి 15 రూపాయల చొప్పున బోనసు ఇచ్చారు. అలాగే పంట నూతులకు కూడా కొంతబోనసు ఇచ్చారు. విత్తనాలు, ఎరువులు తక్కువ ధరకు అమ్మే ఏర్పాట్లు చేశారు. దుంపలు, వేరుశనగతో చేసిన ఆహారాలు అందరికీ అందేటట్లు చేశారు. మాటిమాటికీ ధరలు మార్పు చెందకుండా ఏర్పాట్లు చేశారు.

ధాన్యం మిగిలి పోకుండా, సులభంగా సేకరించడానికి ఇరవై వేల గ్రామ ఆహార సంఘాలను ఏర్పాటు చేశారు. రాజకీయ, కులమత వర్గాలతో ఎటువంటి సంబంధమూ లేకుండా, గ్రామంలో నిజముగా ప్రాతినిధ్యమూ, పలుకుబడీ గలవారిని ఈ సంఘాలలో సభ్యులుగా చేర్చారు. ఆ సంఘాల అధ్యక్షులను ఆ సంఘాలవారే ఎన్నుకొనేవారు. ఆ గ్రామ సంఘాలలోంచి ఫిర్కా సంఘాలు, ఫిర్కా సంఘాలలోంచి జిల్లా సంఘాలు ఎన్నుకొనేటట్టుచేశారు. జిల్లా సంఘాలలో శాసన సభ్యులు, కేంద్ర శాసన సభ్యులతోసహా సభ్యులుగా ఉండేవారు. ఆహార సేకరణకు గ్రామంలోంచి రావలసిన ధాన్యం మొత్తం ఎంత అని రెవిన్యూ శాఖవారు చేసే లక్కలను ఈ గ్రామ సంఘాలు తనిఖీ చేసేవి. రైతుదగ్గర - అతని కుటుంబానికీ, వ్యవసాయపు ఖర్చులకూ కావలసినంతమటుకు వదలిపెట్టి, మిగిలిన ధాన్యాన్ని మాత్రం సేకరించే ఏర్పాటు చేశారు. దీంతో, లెక్కలలో పెద్ద పెద్ద తప్పులు,రెవిన్యూ సప్లై ఉద్యోగుల వ్యక్తిగతమైన లోటుపాట్లు బాగా తగ్గిపోయాయి. రైతుల దగ్గర అద