పుట:Naajeevitayatrat021599mbp.pdf/730

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డానికి ఏర్పాటయింది. ఇటువంటి పనులు ఏవైనా, వేరువేరుగా చేసే సంస్థలున్నా - వాటిని ఈ నూతన సంస్థలలో విలీనం చేయాలని నిర్ణయించారు.

మలబారులో ఈ సంఘాలు జయప్రదంగా సాగడం చూచి, ఈ స్కీము కోస్తా జిల్లాలలో కూడా అమలుజరిపించడానికి యత్నం జరిగింది. నాలుగు కోస్తా జిల్లాలలో 47 జనవరికి ఇటువంటివి 108 సంఘాలు ఏర్పడినాయి. ఈ స్కీముకు ముందు లక్ష టన్నుల సేకరణకూడా జరగని కోస్తా జిల్లాలలో, ఈ స్కీము అమలు జరిపిన తర్వాత, ఎవరినీ నిర్భంధించకనే మూడులక్షల నలబై వేల టన్నుల ధాన్యసేకరణ జరిగింది.

రేషనింగు విధానం బందోబస్తుగా జరిగింది. అయిదేసి మైళ్ళలో గల గ్రామాలన్నీ ఒక గ్రూపుగా ఏర్పాటు చేయబడినాయి. ఆ ప్రాంతంలోని ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులు యావన్మందిని సహకార సంఘంలో వాటాదారులుగా తీసుకున్నారు. వాటా ధనం ఒక్కొక్క గ్రూపులోను నాలుగులక్షల రూపాయలకన్న మించకుండా ఏర్పాట్లు జరిగినాయి. ఖరీదులు వాటంతటవే పెరిగి పోకుండా ఉండడానికీ, నిర్ణీతమైన తేదీలోగా ప్రొక్యూర్‌మెంటును ఉత్సాహంగా జరిపించడానికీ బోనసులు ఏర్పరచబడినవి. ఈ సంఘాలలోను, ఒకటి ఇంకొకదానితో పోటీపడి, ఖరీదులు హెచ్చించడానికిగానీ, సేకరణ స్తంభింపజేయడానికిగానీ వీలులేకుండా నిబంధనలు చేయబడినాయి. అంతవరకు వ్యక్తికున్న ప్రాముఖ్యం తగ్గి, వ్యక్తులతోకూడిన సహకార సంఘానికి ప్రాముఖ్యం వచ్చింది. దురాశాపరులై వ్యక్తుల కవకాశాలు సన్నగిల్లినవి. దినుసుల అమ్మకంవల్ల వచ్చిన లాభాలు వ్యక్తులకుగాక, సహకార సంఘాలకే చెందునట్లు ఏర్పాటయింది. అన్ని ప్రాంతాలలోను ఉన్న ధాన్యపుమిల్లులకు పనికలగడానికై, మిగులు ప్రాంతములకు పూర్వం వలె బియ్యం కాక, ధాన్యమే పంపడానికి నిబంధనలు చేయబడినవి.

ఈ స్కీమువల్ల హోల్‌సేలు వర్తకుల ప్రాముఖ్యం తొలగి పోయింది. వచ్చిన లాభమంతా ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులే అను