పుట:Naajeevitayatrat021599mbp.pdf/729

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తమ స్కీము "యుద్ధానంతర పునర్నిర్మాణ సంఘంవారి స్కీముకన్నా ఉత్కృష్టమయిన"దని చెప్పిన ప్రకాశంగారు, దాన్ని గురించి ఇంకా ఇలా చెప్పారు:

"మన రాష్ట్రం ఆహార పదార్థాల విషయంలో స్వయం పోషకంగా ఉండాలి. 1937-39 లలో, నేను రెవిన్యూమంత్రిగా ఉన్న రోజులలోనే, త్వరలో మనకు ఆహారపు దినుసులకు సంబంధించిన గడ్డు సమస్యలు వస్తాయని ఊహించగలిగాను. ఇపుడు ఆహారశాఖవారు చేస్తున్న ప్రొక్యూర్‌మెంటు (ఆహారపు దినుసుల సేకరణ) సరఫరా విషయమై చేస్తున్న కార్యక్రమం - సమస్యా పరిష్కారాత్మకమైనది కాదు. మన ఉత్పత్తితో నూటికి యాభై వంతులు ఆహారపు దినుసుల ఉత్పత్తే గనుక, మన రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలు కాకున్నా, కొన్ని ఫిర్కాలయినా స్వయంపోషకంగా చేయవలసిన బాధ్యత ప్రభుత్వశాఖలు వహించాలి."

అందరు మంత్రులూ ఆ స్కీము ఆగస్టునాటికి ఒప్పుకొనడం జరిగింది. ఆ స్కీములో ముఖ్యసూత్రం క్లుప్తంగా చెబుతాను. ఫిర్కాల అభివృద్ధి, కొనుగోలు ఉత్పత్తిదారుల సహకార సంఘాలు, గ్రామ సీమలలో సాంస్కృతికాభివృద్ధి - ఈ మూడూ ఒకదాన్ని అంటిపెట్టుకొని మరొకటి ఉంటాయి.

మలబారులో ఈ సంఘాలు అప్పుడే ఏర్పాటుచేసినట్టు చెప్పి ఉన్నాను. వీటి తాలూకు ముఖ్యమైన పని ఉత్పత్తిదారుల దగ్గర ఉన్న ఆహార దినుసుల సేకరణ, సరఫరాయేగాక - గ్రామస్థులకు నిత్యావసరాలైన కట్టుబట్టలు, కిరసనాయిలు, కట్టుపుల్లలు, పంచదార, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు మొదలైన వస్తువులనూ సేకరించి, అవి కావలసినవారికి సరఫరా చేయడంకూడా, ఈ సంఘాల భవనాలు - గొడౌన్సు గాను, వేర్ హవుసులుగాను ఉండి, గ్రామస్థులకు కావలసిన - కంట్రోలు నిబంధనలో ఉన్న అన్నివస్తువుల సేకరణ, వితరణ కార్యాలు చేయడమే గాక; వారికి కావలసిన బాంకింగు (పరపతి) సంస్థలుగానూ పనిచేయించ