పుట:Naajeevitayatrat021599mbp.pdf/719

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉన్న పరిస్థితులనుబట్టి, పట్టాభి సీతారామయ్యగారిని నాయకునిగా ఎన్ను కొనేందుకు మీరు సలహా ఇవ్వవలసినది. పట్టాభి సీతారామయ్యగారికి కూడా చెప్పవలసినది," అని ఉంది.

గాంధీగారు, పట్టాభిగారికి ఈ విషయమై ఇచ్చిన సలహా సారాంశము:

"నువ్వు యత్నించే ముందు రాజగోపాలాచారిగారి సలహా తీసుకోవలసినది. ఆయన చిత్త స్థైర్యమందు నాకు నమ్మక మున్నది.[1] మీరు మాత్రం ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కావాలన్న భావం వదులుకోండి."

ఈ విషయాలు సూచావాచాగా పత్రికలలో పడడమేగాని, సంపూర్ణంగా సభ్యులందరికీ తెలియవు.

ఇక్కడ జరుగుతున్న గందరగోళంలో, మంత్రివర్గం సమయానికి ఏర్పాటవుతుందో, కాదో అన్న అనుమానంచేత, గవర్నమెంట్ ఆఫ్ ఇండియావారి 1935 నాటి ఆక్టు - 93 సెక్షన్‌క్రింద గవర్నరుకు రాజ్యాధికారమప్పగిస్తూ, 1939లో చేసిన ఉద్ఘోషణ (Proclamation) ను పొడిగిస్తూ 1946 ఏప్రిల్ 16 న ఒక తీర్మానం హవుస్ ఆఫ్ కామన్సులో ఆమోదమయింది.

చెన్నరాష్ట్ర నాయకుడుగా ప్రకాశంగారి ఎన్నిక

ఏప్రిల్ 23 న హిందీ ప్రచార సభా మందిరంలో, శాసన సభ్యుల సభ జరిగింది. ప్రజలిచ్చిన యాభైవేల రూపాయలు ప్రకాశంగారు ఖర్చు చేసుకోకూడదని గాంధీగారు ఆంక్ష విధించినట్టు తెలియగానే, సుప్రసిద్ధ నాయకులయిన దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు, నడింపల్లి లక్ష్మీనరసింహారావుగారు మొదలైనవారు "ఆంక్ష తొలగించకపోతే, ప్రకాశంగారికి ప్రత్యేకంగా లక్ష రూపాయలు తాము వసూలు చేసి యిస్తా"మని, పత్రికా ప్రకటనలోనూ, గాంధీగారికి ప్రత్యక్షంగా

  1. "I have not lost my trust in the sanity of his Judgement," అని గాంధీగారి వాక్యము.