పుట:Naajeevitayatrat021599mbp.pdf/710

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాంధవ్య ప్రభావం కలిగినపుడు ప్రస్తుతాప్రస్తుతములు పాటింపుకురావు గదా! సభలోని వ్యతిరేకత మరింత స్ఫుటమయింది. ఒకరిద్దరు, "ఇది రజతోత్సవ సభా? లేక రాజాజీపక్ష ప్రచార సభా?" అని కేకలు వేయడం మొదలుపెట్టారు. ప్రత్యేకంగా, అల్లరులు ఏవీ కాలేదుగాని, మహాత్మాగాంధీని ఆ విధంగా ఎదిరించేందుకు అదే ప్రథమ అనుభవము. బహుశా, అదే చివరిదీ అనుకుంటాను.

వయసులోను, అనుభవంలోను తమకన్న చిన్నవారైన నాడార్ గారిని 'క్లిక్‌' నాయకుని క్రింద గాంధీగారు సూచించిన దానిని ఖండించే బాధ్యత తమపై వేసుకొన్న ప్రకాశంగారు గాంధీగారిని రెండు మూడుచోట్ల విమర్శించారు. ఇటువంటి ఖండన న్యాయమైనా, గాంధీగారిని బాధించే ఉంటుంది. ఈ కారణాలనే సమిధలతో గాంధీగారి కోపం రగుల్కొని, మూడు నెలల తర్వాత ప్రకాశంగారి పైన తమ ప్రభావాన్ని, తీక్ష్ణతను చూపించాయి.

అంతకు ముందు జరిగిన చరిత్ర ముందుగా వివరించాలి.

12

1946 ఎన్నికలు -

రాష్ట్రనాయకత్వ వివాదము

1946 లో అనుకున్న ప్రకారమే ప్రపంచ మహా యుద్ధం అంతం కావడంవల్ల దేశంలోగల రాష్ట్రాలన్నిటిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 ఆక్టు ననుసరించి ఎన్నికలు జరిగాయి. తెలుగు ప్రాంతంలో హెచ్చయిన తగాదాలేవీ లేకుండా అభ్యర్థులను నిర్ణయించగలిగాము. తమిళ ప్రాంతంలో - ఇదివరలో చెప్పినట్టు, అసఫ్ అలీ వగైరాలు చేసిన ఏర్పాటు మేరకు రాజాజీ వర్గంవారు, తక్కినచోట్ల కామరాజ్‌వర్గంవారు అభ్యర్థులుగా నిలుచున్నారు. చెన్నరాష్ట్రంలో గల నాలుగు భాషల ప్రాంతాలలోను, ఏవో రెండు ప్రత్యేక నియోజకవర్గాలలో తప్ప, తక్కిన అన్నిచోట్లా కాంగ్రెసు అభ్యర్థులే