పుట:Naajeevitayatrat021599mbp.pdf/705

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని, అది - రాజకీయంగా ప్రకాశంగారిపైన కోపంగా మారి, ఆయన అద్వితీయమైన త్యాగచరిత్రను గూడా మరపుకు తెచ్చేంత గాఢంగా ప్రబలింది.

విధి బలీయమై రాజాజీని ముందుకు తీసుకువెళ్ళింది. ఆ విధియే అంతకన్న బలీయమై, ప్రకాశంగారిని వెనక్కుత్రోసుకు వెళ్ళింది.

గాంధీగారి చెన్నరాష్ట్ర పర్యటనము

ఒరిస్సా ప్రాంతంలో పర్యటించిన గాంధీగారు ఆంధ్ర జిల్లాల మీదుగా, దక్షిణ భారత హిందీ ప్రచార సభ రజతోత్సవ సందర్భంగా చెన్నపట్నానికి వెళ్ళారు. అలా వెళుతూండగా జరిగిన చరిత్ర, ఆంధ్రదేశ చరిత్ర స్వరూపాన్ని నూతనంగా రూపొందించింది, క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత, ఆంధ్రా కాంగ్రెస్ కమిటీకి క్రొత్త ఎన్నికలు జరగలేదు. పూర్వంలోవలెనే కళా వెంకటరావుగారే కార్యదర్శులుగా ఉండిరి. గాంధీగారు ప్రయాణం చేసే రైలుబండి ఆంధ్రదేశంలోకి వచ్చేసరికి ఆయనకు స్వాగతం ఇవ్వడానికి వెంకటరావుగారు బరంపురంవరకూ వెళ్ళి, ఆయన ఉన్న స్పెషల్ కంపార్ట్‌మెంటులో ఎక్కారు.

ఇదివరలో వ్రాసినదానిని బట్టి, ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ కమిటీలో, పట్టాభిగారి నాయకత్వాన్ని పురస్కరించుకొని ఒక చిన్న వర్గం, ఒక చిన్న పాయగా నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దానికి, చేత బల్లెము పట్టుకొని ముందుకు నడచే దళ నాయకుడిగా వెంకటరావు గారు ఉండడాన్ని చదువరులు గ్రహించియే ఉంటారు.

విశాఖపట్నం స్టేషనులో నేను గాంధీగారిని ఆహ్వానించాను. ఆయన రైల్వేస్టేషన్ ఆవరణలోనే ఉపన్యసించి, తమ కంపార్ట్‌మెంటులోకి వెళ్ళిపోయారు. ఆ మధ్యాహ్నం మరొక మెయిలు బండికి కలపడానికి దానిని వాల్తేరు స్టేషనునుంచి ఐదారు మైళ్ళ దూరంగా, జన సంబంధంలేని స్థలంలో నిలబెట్టారు. ఆయన స్నానపానభోజనాదులు ఆ కంపార్ట్‌మెంటులోనే ఏర్పాటయి ఉండెను. (అది ఒక మూడవ తరగతి