పుట:Naajeevitayatrat021599mbp.pdf/703

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వంతంగా తొలగించేశాను," [1] అని జవాబువ్రాశారు. ఇది అయినతర్వాత ఆయన కాంగ్రెసు సభ్యత్వం పూర్తిగా వదలుకోవడంకూడా జరిగింది. ఆయన 'సన్‌డే అబ్జర్వర్‌' అనే పత్రిక సంపాదకునిమీద పరువునష్టం దావా తేవడం, అందులో - టి. అవినాశలింగంగారి డైరీలో రాజాజీ వ్యక్తిసత్యాగ్రహానికి వ్యతిరేకంగా ఇచ్చిన ఉపన్యాసాలప్రసక్తి సాక్ష్యంగా బయలుపడడం మొదలైన విషయాలు జరిగినవి. ఆ కారణంచేతా, అంతకుముందే సత్యమూర్తిగారు కారాగృహంలోఉన్న కాలంలోనే స్వర్గస్థులు కావడంచేతా, తమిళప్రాంతంలో సహజంగానే కాంగ్రెసు నాయకత్వం అంతరించింది. తరువాత కోవలోఉన్న ఉపనాయకవర్గంలో ముఖ్యుడు కామరాజ నాడారుగారు. కాంగ్రెస్ సంస్థ ఆయన చేతిలోకి వెళ్ళింది. అయితే, చెన్నరాష్ట్రాని కంతటికీ నాయకత్వం సహించడానికి తన శక్తి పరిమితమైనదని తెలుసుకొని, ఆయన - ప్రకాశంగారికి నాయకత్వం అప్పజెప్పడానికి నిర్ణయించుకొన్నాడు. అయితే, ఇది జనరల్ ఎన్నికల తరువాత జరుగవలసిన విషయము.

ఈలోపున విధి బలీయమైనదని మరొకమారు ఋజువయినది. పైనచెప్పిన విషయాలవల్ల, రాజాజీకి తిరిగి కాంగ్రెసులో ఎటువంటి స్థానముగాని లభిస్తుందని ఎవరూ అనుకోలేదు. ఆయన, కాంగ్రెసులో తిరిగీ సభ్యుడుగా చేరుదామంటే తమిళప్రాంత కాంగ్రెస్ కమిటీ వారెవ్వరూ అందుకు అంగీకరించలేదు. అంతవరకు, మానవప్రకృతి ప్రకారంగా జరిగింది. గాంధీ గారి ప్రకృతి వేరు. రాజాజీతో ఆయనకున్న సంబంధమే వేరు. అందుచేత, ఆయన ప్రోద్బలంవల్ల కాంగ్రెసు సాలుసరి చందా నాలుగు అణాలు - ఢిల్లీలో, కాంగ్రెసు అధ్యక్షులయిన అజాద్‌గారు (1942 లో బలవంతంగా రాజాజీని కాంగ్రెసునుంచి తొలగించిన అజాద్‌గారే) పుచ్చుకొని, రాజాజీని కాంగ్రెసు సభ్యునిగా చేర్చుకున్నారు.

  1. " I forced him out of the Working committee."