పుట:Naajeevitayatrat021599mbp.pdf/702

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అడిగితే, అది ఇన్‌ఫార్మల్ మీటింగు అనడం, మినిట్సు పుస్తకంతో సంబంధంలేని వేరే కాగితంమీద ప్రొసీడీంగ్స్ వ్రాయడం, ఆ ప్రొసీడీంగ్స్‌లోనూ ఈ ఇన్‌స్ట్రక్షన్స్ విషయమై ఏ తీర్మానం లేకపోయినా, వాటిని కాంగ్రెస్ కమిటీ లెటర్ హెడ్డులపైన రోనియో కాఫీ చేయించి, ఆధికారరీత్యా విడుదల అయినట్టు ప్రకటించడం, గాంధీగారికి సంబంధం లేకున్నా ఆయన పేరు దీనిలో కలపడం - ఇవన్నీ ఆంధ్ర రాజకీయాలలో పదవీవ్యామోహంతో, అసత్యమనే వాహనంపైన, అత్యాశాపరులు ఎంతదూరం పోగలరో చూపించేగలిగే తార్కాణాలు.

సవ్యమైన మార్గంలో ఏ పదవినైనా పొందడానికి ప్రయత్నించడం దోషంకాదు. కానీ, మార్గాలు వక్రమయితే రాజకీయాలు కలుషితమై, రాజకీయ జీవితాలను అప్రతిష్ఠ పాలు చేస్తాయి. ఈ విధమైన మార్గం, ఆంధ్రులను ఎక్కడికి తీసుకువెళ్ళినదీ తరువాత అధ్యాయంలో వివరిస్తాను.

11

1946 లో రాష్ట్ర రాజకీయములు

ఆంధ్రప్రాంతంలో రాజకీయాల మాట కొంచెం ఆపి, అదే సమయంలోని తమిళ ప్రాంత రాజకీయాలను కొంచెం వివరిస్తాను. క్విట్‌ఇండియా ఉద్యమంలో యావన్మంది కాంగ్రెసు వాదులు జైళ్ళలోకి పోవడం, వారిలో కొందరు ఆస్తిపాస్తులను పోగొట్టుకోవడం జరిగిన సమయంలో - రాజాజీ పాకిస్థాన్ ప్రచారం చేయడంవల్ల, ఆయన పలుకుబడి సంపూర్ణంగా నశించింది.

1942లో ఆయన ఆ ప్రచారం ఆరంభించినపుడు, సత్యమూర్తిగారు కాంగ్రెస్ అధ్యక్షులయిన అజాద్‌గారికి, "రాజాజీపైన మీరు క్రమశిక్షణ చర్య ఎందుకు తీసుకోరు?" అని ఒక ఉత్తరం వ్రాశారు.

దానికి అజాద్‌గారు "ఆయనను వర్కింగ్‌కమిటీలోంచి బల