పుట:Naajeevitayatrat021599mbp.pdf/699

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వర్కింగ్ కమిటీ మెంబర్లందరు విడుదలయిన తరువాత, బొంబాయిలో వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొని, డాక్టర్ పట్టాభిగారు విజయవాడ వచ్చారు. నేనుకూడా ఆ సమయానికి విజయవాడ వెళ్ళి ఉన్నాను. అక్కడ సాయంకాలం బహిరంగ సభలో ఆయన ఉపన్యసించారు. ఆ ఉపన్యాసంలో ఆంధ్రా సర్క్యులర్ అన్నది గాంధీగారి అనుజ్ఞపైనే తాను ప్రకటించినట్టు చెప్పి, పెద్దలే అన్నది కాదంటే తాను ఏమి చేయాలన్న ధోరణిలో మాట్లాడారు. అది మర్నాడు ఉదయం పేపర్లలో పెద్ద అక్షరాలతో పడింది.

ప్రకాశంగారు అదిచూచి, పట్టాభిగారిని కలుసుకొనేందుకు, వెంటనే విజయవాడ వచ్చారు. నేను ఆయనను కలుసుకొని, పట్టాభిగారు బందరు వెళ్ళినట్టు చెప్పగా, ఆయన వెంటనే బందరు వెళ్ళారు. పట్టాభిగారితో మాట్లాడి, పత్రికలలో పడ్డ విషయం సరైనదికాదని ఒక సవరణ స్టేట్‌మెంటు తీసుకువచ్చారు. ఆ ఉదయమే ఆయన, నేనూ గ్రాండ్‌ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో వార్ధా వెళ్ళాము. మేము వార్ధా ఆశ్రమానికి వెళ్ళేసరికి చీకటి పడింది. గాంధీగారు తమ కుటీరం ముందుగా, నేలపైనే పక్కవేసుకుని పండుకొని ఉన్నారు.

ప్రకాశంగారు గాంధీగారికి సమస్కరించారు. వెంటనే గాంధీజీ ఆంధ్రా సర్కులర్ విషయమై ప్రసంగించారు. పట్టాభిగారి మాట తేగా, ఆయన ఉపన్యాసంపై వచ్చిన పత్రిక రెపోర్ఘు సరిగా లేదనీ, దానికి ఆయనే ఒక సవరణ ఇచ్చారనీ చెప్పి ప్రకాశంగారు తన జేబులోంచి పట్టాభిగారు ఇచ్చిన కాగితం గాంధీగారికి అందించబోతే, ఆయన "అసలు అన్నదానికన్న సవరణ మరింత అన్యాయంగా ఉన్న"దన్నారు. ఆ సవరణలో పట్టాభిగారు - ఆ కాగితంలో విషయాలు చర్చిస్తున్నపుడు గాంధీగారు, తక్కిన వర్కింగ్ కమిటీ మెంబర్లు ఎలా కూర్చున్నారో చెప్పడమే అందుకు కారణము. ఆయనదగ్గర మేము కూచున్న నలభై నిమిషాలు - మహాత్మాజీ ఈ విషయంతప్ప మరొకటి మాట్లాడ లేదు. అక్కడ కూచున్నంతసేపూ ప్రకాశంగారు పట్టాభిగారిని సమర్థిస్తూనే ఉన్నారు. ఎంత సమర్థించినా, గాంధీజీ విమర్శించడం మాన