పుట:Naajeevitayatrat021599mbp.pdf/697

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలియదుగానీ - మేమంతా వాటికి ఏ జవాబు ఇవ్వాలో నిర్ణయించుకోడానికి ఒక చోట సమావేశమయ్యాము. అప్పటికింకా సత్యమూర్తిగారు ఉన్నారు. ఆ చార్జిషీట్లలోనివి చాలా మటుకు నిస్సారమయిన విషయాలే. అయినప్పటికీ, మేము వ్రాసేది ఏదీ విడుదలకోసం చేసే యత్నంలాగా ఉండకూడదు. వ్యక్తిగతంగా చెప్పిన వివరంలో ఏదైనా తప్పుంటే అది దిద్దవచ్చు. కాని, అది తప్పుకోడానికి చెప్పే జవాబులాగా ఉండకూడదు. అందుచేత, మాలో చాలా మందిమి ఏ జవాబూ ఇవ్వక ఊరుకుందా మనుకున్నాము. అయితే, ప్రకాశంగారు మాత్రం ఆంధ్రా సర్క్యులర్ అనేది ఆంధ్రా ప్రొవిన్షియల్ వర్కంగ్ కమిటీ ఎన్నడూ ఇవ్వలేదనీ, ఇటు వంటి ప్రోగ్రాం చర్చించడానికి ఆ కమిటీ ఆస లెన్నడూ సమావేశం కాలేదనీ వ్రాయవలిసి వచ్చింది. ఈ విషయం మేము చెప్పేసరికి ప్రకాశంగారి మీద కళా వెంకటరావు విరుచుకు పడ్డాడు.


వెంకటరావు - తాను గాంధీ విధేయుడనీ, సత్యం తప్పనివాడనీ చెప్పి, 'ప్రకాశంగారు బందరు మీటింగు ప్రొసీడింగ్స్‌కి సంతకం పెట్టారా, లేదా?' అని కేకలు వేశాడు. బందరులో పట్టాభిగారింట జరిగిన సమావేశం వర్కింగ్ కమిటీ సమావేశం కాదనీ, ఏదో కొందరు మిత్రులు కలుసుకుంటారనీ తాను బెజవాడ ప్లాట్‌ఫారం మీద నాకు చెప్పిన విషయం మరిచిపోయాడు. తాను చూపించిన కాగితం గాంధీగారి అనుజ్ఞక్రింద వ్రాసిందన్నమాట అసంభవమని ప్రకాశంగారు అడ్డు చెప్పిన మాట మరచిపోయాడు. 'ప్రకాశంగారు ప్రొసీడింగ్స్‌కి సంతకం పెట్టారా, లేదా?' అని మరొక మారు అడిగాడు. "ఇన్‌ఫార్మల్ ప్రొసీడింగ్స్ వ్రాసిన కాగితం కాదుటయ్యా?" అని నే నడిగాను. "అది వర్కింగ్ కమిటీ మినిట్సు పుస్తకం" లోని కాగితం కానేకాదని జ్ఞాపకం చేశాను.

అసలు వెంకటరావు మనసులో ఈ భ్రమ కలగడానికి కారణం ఇది: బొంబాయి ఏ.ఐ.సి.సి. మీటింగు జరుగుతున్నప్పుడు తానే ఆంధ్రా ప్రొవిన్షియల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తాలూకు లెటర్‌హెడ్లపైన