పుట:Naajeevitayatrat021599mbp.pdf/693

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ప్రజలు మనల్ని విడిపించేట్టయితే, ఈ జెయిలరు ఇంత సావకాశంగా మన దగ్గరికి ఎలా వస్తా?" డని అనుభవం పొందిన కొందరు పెద్దలనేసరికి - అది సరిగానే ఉందనిపించింది. కాని, ఏ విప్లవమూ రాలేదన్న ఆశాభంగం మాత్రం మాలో అటువంటిదానిని ఆశించిన వారందరికీ కలిగింది. ఏది ఏమైనా పన్నెండు గంటలయ్యేసరికి - మా సామానులు మోయడానికి ఇరవై మందిదాకా ఖైదీలు, ముగ్గురు నలుగురు వార్డర్లు హాజరయ్యారు. అంతటిలో ఎవరి మూలంగానో, మమ్మల్ని మరొక జెయిలుకు పంపి, మా స్థలంలోకి పై రాష్ట్రనుంచి డెటిన్యూలను తెస్తున్నారనే వార్త బయట పడింది.

అందుచేత, మాలో కొందరికి - రాబోయే డెటిన్యూలకు వెళ్ళి పోయిన డెటిన్యూ లెవరో తెలియడం కోసం మా పేర్లు గోడలమీద పెన్సిళ్ళతో వ్రాస్తే బాగుంటుందని తోచింది. సరేనని అలాగే చేశాము. కొందరు తమ జీవిత వివరాలుకూడా ఒకటి రెండు ఆ గోడలమీద ఎక్కించారు. ఆ విధంగా, కొంత విపులంగా వ్రాసుకున్న వారిలో నీలం సంజీవ రెడ్డిగారు ఒకరు. అలా వ్రాసుకోవలసిన అవసరం లేకుండానే తర్వాత ఈయన దేశవ్యాప్తమైన పేరు తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. మేము వెళ్ళేసరికి, రెండు మూడు లారీలనిండా డెటిన్యూలు తమ సామాన్లతో జెయిలు ప్రవేశంకోసం వేచి ఉన్నట్లు పోల్చుకో గలిగాము. వారున్న బస్సుల కిటికీలు తెరలతో మూయబడి ఉన్నాయి, అయినా, ఒకమూలనుంచి రవిశంకర్ శుక్లా (మధ్య రాష్ట్రాల మాజీ ముఖ్య మంత్రి) ముఖం మాత్రం, ఆయన తెల్లని బొద్దు మీసాలవల్ల వెంటనే పోల్చుకో గలిగాము. మేము వారి బస్సులవైపు వెళ్ళడానికి పోలీసువారు ఒప్పుకోలేదు. బస్సులో వాళ్ళు తెరల సందులలోంచి మాలో ఎవరినైనా పోల్చుకో గలిగారో లేదో తెలియదు.

మమ్మల్ని అన్నీ సెకండు క్లాసు పెట్టెలున్న బండిలో చెన్నపట్నం తీసుకువెళ్ళి, ఆ రాత్రి పెనిటెన్షియరీ జెయిలులో ఉంచి, మర్నాడు ఉదయం సెంట్రల్ స్టేషన్లో గ్రాండ్‌ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కించారు. కాని, మమ్మల్ని ఎక్కడికి తీసుకు వెళుతున్నారో మా