పుట:Naajeevitayatrat021599mbp.pdf/688

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టిలో బస్సు కదిలి ఒక ఫర్లాంగుదూరం వెళ్ళేసరికి, యాభై అరవై అడుగుల వెడల్పున్న రాజవీథి కూడా కనుచూపు మేరవరకు ప్రజలతో నిండిఉండడంవల్ల మేమందరం తెల్లవారు, నల్లవాళ్ళం కూడా దిగవలసి వచ్చింది. అక్కడ నడుస్తూన్న ప్రజలు లక్షకు తక్కువ ఉండరు. అలా ఎందుకు నడుస్తున్నారో, ఎక్కడికి నడుస్తున్నారో ఎవరికీ తెలియదు. కాని, అందరి ముఖాల మీద, అందరి కళ్ళల్లోను ఏదో ఒక ఆశ; ఏదో ఒకటి సాధించామన్న భావం మూర్తీభవించి నట్టు కన్పించింది. బస్సునుంచి దిగిన తెల్లవాళ్ళు మా ప్రక్కనే నడుస్తున్నారు. ఎవరూ వారిని పల్లెత్తు మాట అనలేదు. కాని, అంతటిలో ఆ ప్రక్కనే నెక్‌టై, కాలర్, హేటు ధరించిన భారతీయుడు కనిపించే సరికి, అతనిని ముట్టడించి, వాటి నిమ్మని అడిగారు. ఇవ్వకుంటే లాక్కునే లాగున కనిపించే సరికి అతడు అవి తీసి ఇచ్చాడు. వాటి గమ్యస్థానం శివాజీ పార్కులో ఏర్పాటైన విదేశ ప్రభుత్వం చితి. మేము చూస్తుండగా వందల కొద్ది హేట్లు, నెక్‌టైలు, కాలర్లు అక్కడికి వచ్చాయి. ఆ ప్రాంతంలో ఏదో ఒక మూల మాత్రం షూటింగు జరిగినట్టు వార్త. కల్పాదేవి రోడ్డులోని భాగ్యవంతులైన వెండి, బంగారం, రత్నాల వర్తకులు ప్రజా సమూహం తమపైన వచ్చి పడకుండా తామే రహదారులు బందు చేసుకున్నారు. సాయంకాలం నాలుగు గంటలయ్యేసరికి పట్నంలో అనేక స్థలాలలో కాల్పులు జరిగినట్టు నాలుగు వైపుల నుంచీ వార్తలు రాసాగినాయి.

ప్రకాశంగారు ఈ అల్లరులలో అరెస్టు కాలేదు. ఆ రోజున అక్కడున్న ఆర్డర్లప్రకారం కాంగ్రెసు నాయకులను వారి వారి రాష్ట్రాలలో అరెస్టు చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశించినట్టు ఆ తర్వాత తెలిసింది. నాకు హైదరాబాదు, విజయవాడ వెళ్ళే రైలులో చోటు దొరక్క; బొంబాయి నుంచి రాయపూర్ మీదుగా విశాఖపట్నం బయలుదేరాను. నా చేతినిండా, పటేలుగారింట ఏక్షన్ కమిటీ ఇచ్చిన శాబటేజ్ ప్రోగ్రాం కాగితాల కట్టలున్నాయి. నేను ప్రతి ప్లాట్‌ఫారం మీద అవి పంచుతూ, పార్వతీపురము స్టేషన్లో తాళ్ళపూడి కృష్ణమూర్తి అనే