పుట:Naajeevitayatrat021599mbp.pdf/673

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రమహాసభలో మాత్రం అభిరుచి హెచ్చుగా చూపించారు. అప్పట్లో ఆయన పెద్ద న్యాయవాదిగా ఉండేవారు. అప్పటినుంచి ఆయన ప్రతి ఆంధ్ర మహాసభలోను ప్రముఖ పాత్ర వహించేవారు. ఇంతలో 1917 ఏప్రిల్‌లో తెలుగుజిల్లా లన్నింటికి రాష్ట్రకాంగ్రెస్ కమిటీ ప్రత్యేకంగా ఉండాలని ఏర్పాటయింది, ఆ ఏడే మరొక ఆరు నెలల తర్వాత సింధుకు కూడా ప్రత్యేక రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉండాలని తీర్మానమయింది. ఈ ఏర్పాట్లతో ప్రత్యేకంగా ఆంధ్రరాష్ట్రం కావాలా, వద్దా అన్న సందేహాలన్నీ నశించాయి. తర్వాత గాంధీగారి నాయకత్వం క్రిందికి దేశమంతా రావడమూ, కాంగ్రెస్ సందేశం దేశం మూలమూలలకు తొందరగా వ్యాపించడమూ, జరిగి జాతీయభావం పెంపొందింది. భాషలను అనుసరించి, వివిధ రాష్ట్రాలుగా దేశమంతా విభజన చేయడం జాతీయ భావము పెంపుదలకు, స్వాతంత్ర్య సమరం శాస్త్రీయంగా నడపడానికి దోహదం చేసింది. ఒక భాషాప్రాంతంవారికి మరొక భాషా ప్రాంతీయులపై విద్వేషం కాని, ఒక రాష్ట్రంవారు రెండో రాష్ట్రంలో ఉద్యోగ వర్తక వ్యాపారాలు చేసుకోకూడదన్న భావాలు ఆనాటి ఉద్యమంలో భాగాలుగా లేవు. ప్రాంతీయులకు ఉద్యోగాలు ఇవ్వవలసిన దన్నది పునాది సూత్రమే. అయినా, ఆ రోజులలో భాషావిద్వేషం లేదు. అందుచేత కాంగ్రెస్ ప్రచారం కోసం దేశాన్ని భాషారాష్ట్రాలుగా విభజించి, ఆ సూత్రంపైనే దేశ స్వాతంత్ర్యం లభిస్తే దేశంలో రాష్ట్రాల పునర్విభజన జరుగుతుందని - కాంగ్రెస్ అనేకసార్లు వాగ్దానం చేసింది.

1938 లో మొదటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 30-3-1938 న లెజిస్లేటివ్ అసెంబ్లీలోను, 31-3-38 న కౌన్సిల్‌లోను ఒక తీర్మానం పాసు అయింది. దాని సారాంశము ఇది. చెన్న రాష్ట్రంలో గల తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ ప్రాంతాలు ప్రత్యేక పరిపాలనా రాష్ట్రాలుగా ఏర్పాటుచేయడానికి బ్రిటిషు ప్రభుత్వం వారిని కోరవలసిందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సిఫారసు చేయడానికి తీర్మానించ బడింది. ఇంగ్లండులో ఉన్న ఇండియా కార్యదర్శికి యీ తీర్మానం అంద