పుట:Naajeevitayatrat021599mbp.pdf/667

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తమ త్యాగీ ప్రకాశం దృష్టికి ఎందుకు రాలేదు?" అన్నమాట మెల్లగా అనడం, మరికొందరు తెలుగువాళ్ళతోకూడా ఒకరి విషయం ఒకరితో చెప్పడం - రెండు, మూడు పర్యాయాలు రాజాజీ కొందరి విషయాలలో చేయడంతో తెలుగు బృందంలో ఒక సంచలనం కలగడం ఆరంబించింది. దీనికితోడు, తాము ఉన్న హాలులోనే బసచేసిఉన్న, ఉపనాయక శ్రేణిలోఉన్న తెలుగు సత్యాగ్రహులతో ఆయన ఒక రోజున, "చూశారా! మీ ఆంధ్రరాష్ట్ర కమిటీకి నాగేశ్వరరావు గారు, వెంకటప్పయ్యగారు, ప్రకాశంగారు - వీరినే స్థిరబుద్ధితో ఆరాధించి అధ్యక్షులుగా ఉంచుతున్నారు, తమిళరాష్ట్రంలో మార్పులు ఎప్పటికప్పుడు జరుగుతాయి. స్థిరత్వం లేదు," అన్నారు రాజాజీ. ఈ మాట ఒకరిద్దరి తెలుగువారియెడ రాజాజీకున్న ప్రశంసాభావమని అనుకున్నారు. అయితే, నాయక పదవిని మనసులో ఆశించే ఒకరిద్దరు, వీరు తప్ప మీకు నాయకులు లేరు అన్న ఎత్తిపొడుపు క్రింద గ్రహించారు. జెయిలు నుంచి విడుదలయి తిరిగివెళ్ళిన తరువాత, ఆంధ్రదేశ నాయకత్వంలో మార్పు తేవాలన్న గాడవాంఛ వీరిలో కొంతమందికి అంకురించింది,

ఇలా ఉంటూండగా, ఈ సపర్ణుల నాయకత్వమే ఎందుకు శాశ్వతంగా ఉండాలని ఏ పెద్దవారో అనడంచేత హరిజన సభ్యులుకూడా ప్రత్యేకంగా సమావేశాలు ఆరంభించారు. వీటి ప్రభావం రానురాను చెన్నరాష్ట్ర రాజకీయాలపై బాగా కనిపించిన విషయం చారిత్రకంగా నిర్దారణ అయింది. దీనికితోడు, జాన్ గంతర్ అనే ఆయన వ్రాసిన "ఇన్‌సైడ్ ఏషియా" అనే గ్రంథంలో రాజాజీని గూర్చి వ్రాసిన నిందా వాక్యాన్ని రాజాజీ విముఖులకొక ఆంధ్రమిత్రుడు చదివి వినిపించ నారంభించారు. దాంతో, తెలుగువారికి తమిళులకు మధ్యనున్న సామరస్యము, ఇదివరకు చెడిపోక మిగిలినదికూడా చెడ నారంభించింది. ఒకే కాంగ్రెసులో ఒకే గాంధీగారి నాయకత్వం క్రింద ప్రకాశంగారు, రాజాజీ పనిచేస్తూన్నప్పటికీ; మంత్రివర్గాలు ఏర్పాటు కాకముందు, మంత్రి వర్గంలో కార్యకలాపాలు నడిపిస్తున్న సమయంలోనూ, చివరికి కారాగృహవాసం చేస్తున్న సమయంలోనూ ఇద్దరి జీవిత ప్రవాహాలు కలిసి