పుట:Naajeevitayatrat021599mbp.pdf/665

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండు నెలలయ్యేసరికి, ఆ కారాగృహావరణం రెండోభాగంలో రాజాజీ పీఠంకూడా గట్టిగా ఏర్పడింది. ఆయన అదివరకే గీత, ఉపనిషత్తులు మొదలైనవి అనువాదములు తడివి చూసినవారు. ఇక్కడ సంస్కృత పాండిత్యంగల సంతానం, ఎస్. ఎస్. వరదాచారి మొదలైనవారు ఆయన బృందంలో చేరి - గీతార్థ ప్రబోధాలకు, ఉపనిషత్తుల భాష్యాలకు, విశిష్టాద్వైత పరంగా అర్థాలు చెప్పుకుంటూ ఉండేవారు. మరొకమూల టి. నాగిరెడ్డి మొదలయినవారి యువ కమ్యూనిష్టు బృందం (ఏడు, ఎనిమిది మంది) కమ్యూనిజం, సోషలిజాలకు సంబంధించిన గ్రంథపఠనం మతావేశంతో చేసుకునేవారు.

పరస్పర సంభాషణలు, భాష్యార్థములు కాలక్షేపం కోసం చేసుకునేవారే కాని, ఒకరి మతం ఒకరు ఎన్నడూ అవలంబించలేదు. అద్వైతులు విశిష్టాద్వైతం విన్నా, విశిష్టాద్వైతులు అద్వైత భాష్యాలు విన్నా, కాంగ్రెస్‌వాదులు కమ్యూనిస్టుల మాటలు విన్నా ఎవరిమతం వారిదే. శక్తిపూజ విషయంలో మాత్రం - అంటే రాజకీయంగా జెయిళ్ల అనంతరం ఎవరికి పదవీ స్వీకార శక్తి హెచ్చుగా కలుగుతుందో అన్న విషయంలో మాత్రం - అట్టి శక్తికి మూల పురుషులను కొనబడేవారియెడల మతం మార్చుకునే సంఘటనలు జరుగుతూండేవి.

"ఈ వ్యక్తి సత్యాగ్రహ మనేది పనికిరాని బెడద" అని రాజాజీ స్తుతి నిందాపరంగా చెప్పుకుండడంతోబాటు శిష్యకోటిని చేకూర్చుకొనేందుకు యత్నం కూడా జరిపేవారు. వ్యక్తి సత్యాగ్రహం విప్లవ మార్గంలో మొదటి మెట్టని ప్రకాశంగారు, ఆయన చుట్టూ చేరినవారు నిశ్చితంగా అభిప్రాయపడడం జరిగింది. ఇందులో, ఒక వ్యతిరేకాలంకార చమత్కృతి అందరికీ కనిపించేది. గాంధీగారికి అత్యంత సన్నిహితుడయిన రాజాజీ, తీవ్రమైన గాంధీ విమర్శకులయ్యారు. గాంధీజీకి అత్యంతదూరులయిన ప్రకాశంగారు గాంధీని తీవ్రంగా ప్రశంసించే వారయ్యారు.

ఇటువంటి వాతావరణంలో హిందూ పత్రిక సంపాదకులైన కె. శ్రీనివాసన్ గారు ఒక రోజున రాజాజీని ప్రత్యేకంగా చూడడానికి