పుట:Naajeevitayatrat021599mbp.pdf/662

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కీ అపనమ్మక?" మని ప్రశ్నించగా, జైలు సూపరింటెండెంటు మా సెల్లులకు దగ్గరగా ఉన్న జైలు ఆవరణ గోడను చూపించి, అందులో ఒక భాగం కొత్తగా మరమ్మత్తు చేసిన దానిని చూపించారు. ఆ భాగంలో కన్నం త్రవ్వి కొంతకాలం క్రింద నలుగురు కమ్యూనిస్టు ఖైదీలు పారిపోవడంచేత ప్రభుత్వంవారు ఇటువంటి జాగ్రత్త తీసుకోమని ఆదేశించినట్టు చెప్పారు. అయితే, మాతోబాటు అక్కడ మిగిలి ఉన్న కమ్యూనిస్టులు అలా పారిపోయే వారిలాగా తోచలేదు. అది వేరే మాట.

ఇంతలో, వ్యక్తి సత్యాగ్రహంచేసి జైలులోకి వచ్చేవారి సంఖ్య దినదినానికి పెరగడం ప్రారంభించింది. కాలక్షేపంకోసం ప్రొద్దుట వేళ కొందరు రాజాజీ చుట్టూ చేరేవారు. అలాగే, కొందరు ప్రకాశంగారి చుట్టూ చేరేవారు. అయితే రాజాజీ, ప్రకాశంగారు అట్టే కలుసు కోవడంగానీ, మాట్లాడుకోవడంగానీ జరిగేదికాదు. విరామకాలం చాలా ఉండడంచేత సహజంగా గ్రంథపఠనం సాగేది. రామాయణము, భారతము, భాగవతము మొదలైనవి ఎక్కువగా చదివేవాళ్ళు. అంతకన్న హెచ్చుగా, దాదాపు అందరి చేతుల్లోనూ భగవద్గీత కనిపించేది. సరే! మిగిలిన రాజకీయ గ్రంథాల పైనా, రాజకీయాలపైనా వాదోపవాదాలు చెట్లనీడలలో గుంపులు గుంపులుగా చేరిన సత్యాగ్రహుల మధ్య బహుళంగా, ఒక్కొక్కప్పుడు తీవ్రంగా జరిగేవి. అందులో అందరి దృష్టిలోను పడేటట్లుగా రాజాజీ కూచున్న గుంపు, ప్రకాశంగారు కూచున్న గుంపు విడివిడిగా ఏర్పడినాయి. అందుచేతే.

                         "ఒకచోట రామాయణ కధా శ్రవణ పుణ్య
                                  పదములు - వాల్మీకి అదరిపడగ;
                          ఒకచోట భాగవ తోదంత వ్యాఖ్యాన
                                  తీవ్రత - పోతన్న దిగులుపడగ;
                          ఒకచోట భారతీయ కవితా వాహినీ
                                  స్నాతులై కవులెల్ల సంచలింప;