పుట:Naajeevitayatrat021599mbp.pdf/661

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుమతి పొందిన ముగ్గురు నలుగురు తప్ప పేరుపడ్డ కాంగ్రెస్‌వాదులు ఎవరూ జెయిలు ఆవరణకు అవతల లేరు. వ్యక్తి సత్యాగ్రహాన్ని వ్యతిరేకించిన వారు - జెయిళ్ళలోకి ఎవరూ రారని తాము చెప్పినందుకు వ్యతిరేకంగా జరగడం కంటగింపు కాగా, జెయిళ్ళలోకి వస్తేమాత్రం ఏమి లాభమనే కొత్త నినాదాన్ని ప్రచారం చేయసాగారు.

9

వేలూరు జైలు ముచ్చటలు

వ్యక్తి సత్యాగ్రహం చేయడానికి ప్రథమంగా నాకు అవకాశం ఇవ్వవలసిందని ప్రకాశంగారిని కోరాను. బహుశా ఆయనకు కూడా రాష్ట్రంలో తామే ప్రప్రథమంగా సత్యాగ్రహం చేయాలనే సంకల్పంతో ఉండడంచేత కాబోలు తామే సత్యాగ్రహం చేశారు. నాకు మొట్టమొదట కాకున్నా, ముందుగానే అవకాశం ఇచ్చారు. 26-11-40 నాడు నేను జిల్లా కోర్టు గుమ్మం దగ్గర, గాంధీగారు చెప్పిన వాక్యాలు చదివి శాసనోల్లంఘనం చేశాను. వెంటనే నన్ను అరెస్టు చేసి దూరంగా దువ్వాడ దగ్గరున్న ఫారెస్టు బంగళాలో అంతకు ముందే నా కోసం వచ్చి కూచున్న డిప్యూటి కలెక్టరు ముందు హాజరు పెట్టగా, ఆయన నాకు ఆయన పద్దెనిమిది నెలల కఠినశిక్ష విధించాడు. అలా నేను అరెస్టయి వేలూరు జెయిలుకు వెళ్ళేసరికే, ప్రకాశం గారు అక్కడికి వచ్చి ఉన్నారు. త్వరలోనే ఒకరి తర్వాత ఒకరుగా మంత్రులు, శాసన సభ్యులు జైలుకు రావడం ప్రారంభించారు. తనకు వ్యక్తి సత్యాగ్రహంపైన నమ్మకం లేదన్న రాజాజీ కూడా వచ్చేశారు. మేము వెళ్ళేముందు, అక్కడ పదిమంది దాకా కమ్యూనిస్టులు ఖైదీలుగా ఉండేవారు. లోగడ వారిలో చాలామంది కాంగ్రెసులో ఉన్నవారే. రోజూ సాయంకాలం ఆరు గంటలయేసరికి మమ్మల్ని ప్రత్యేకమైన గదులలో పెట్టి తాళం వేసేసేవారు. "కోరి జైలుకు వచ్చిన మా యెడల యెందు