పుట:Naajeevitayatrat021599mbp.pdf/657

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తగ్గించుకొంటిని. తర్వాత చరిత్రలో ప్రకాశంగారికీ, వీరికి వైషమ్యాలు ప్రాణం పోయేవరకు హెచ్చిపోతూనే వచ్చిన మాట అందరికీ తెలిసినదే.

8

వ్యక్తి సత్యాగ్రహము

గాంధీగారు స్వాతంత్రోద్యమాన్ని ఏ విధంగా కొత్తగా నడిపిస్తారో ఎవరికీ అవగాహన కాలేదు. "యుద్ధ సమయంలో, ఇంగ్లండు దేశం ప్రాణ సంకట సమయంలో ఉన్నపుడు నే నిబ్బంది కలుగజేయను," అన్న ఆయన వాగ్దానం అందరూ ఎరిగిందే. శత్రువుకు ఇబ్బంది కలిగించనిది ఉద్యమం అలా అవుతుంది? ఏదైనా చేసినా, అది ఉద్యమం అని అనిపించుకోవడానికి తగినదవుతుందా?

ఇలా ఉండగా, ఆయన ఒక ఆదేశం ఇచ్చారు. దాని ప్రకారం దేశంలో ప్రతి జిల్లాలోనూ సత్యాగ్రహ సంఘాలు ఏర్పాటు కావాలన్నారు. ప్రత్యేకమైన సంఘాల ఏర్పాటుకాక, జిల్లా కాంగ్రెస్ సంఘాలే సత్యాగ్రహ సంఘాలుగా మారవలసిందని మార్చి నెలలో రామ్‌ఘర్ కాంగ్రెస్ కాగానే ఆదేశం ఇచ్చారు. దాని ప్రకారం, 24 - 4 - 1940 నాడు విశాఖపట్నం జల్లా కాంగ్రెస్ కమిటీ, విశాఖపట్నం జిల్లా సత్యాగ్రహ సంఘంగా మారడానికి తీర్మానించి, అలా మారి పోయింది. నెహ్రూగారు కూడా ఇంగ్లండు సంకటావస్థలో ఉన్న సమయంలో సివిల్ డిస్ ఒబీడియన్స్ (సాత్విక నిరోధం) పైన ఉద్యమం ఏదీ చేయకూడదని ప్రకటించారు. ఈ కట్టుబాట్లలో సుభాస్ చంద్రబోస్ ఎప్పుడూ ఇమిడి ఉండలేక పోయేవారు. ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంటుగా ఎన్నికయినప్పుడు, గాంధీగారు ఆయనను వ్యతిరేకించి, సహకరించక పోవడంవల్ల - ఆయన తన స్వంత ప్రచారంలోనే ఉండేవాడు. ఆయనను జూలై 2 న అరెస్టు చేశారు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మరొకసారి తిరిగి పూనాలో