పుట:Naajeevitayatrat021599mbp.pdf/651

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రక్కనే ఉన్నాయి. అంతలో ప్రకాశంగారు బయటకు వచ్చారు. మామూలు పద్ధతిలో, ఆయన కారులోనే నేనూ, ఆయనా అసెంబ్లీకి బయలు దేరాము. మా ఇద్దరిలో ఎవరూ ఆ వ్యాసం ప్రసక్తి తేలేదు. కొంతదూరం పోయిన తర్వాత "ఈ రోజు ప్రశ్నలకు నేనే జవాబులు చెప్తానులే," అన్నారు ప్రకాశంగారు. నేను "సరే" అన్నాను. కారణం ఆయన చెప్పలేదు. నేను అడగలేదు. ఆ పత్రిక వ్యాసమే కారణమయి ఉంటుందని ఊహించాను. అయితే, ఇటువంటి వ్యాసంవల్ల ప్రకాశంగారి వంటి పెద్దవారు బాధపడ్తారా అని అనుకున్నాను. అలా రెండు మూడు రోజులు జరిగింది. ఆ తరువాత ప్రశ్నల ఫైళ్ళు ఆ మంత్రివర్గం ఉన్నంత వరకు నాకే వస్తూ ఉండేవి. ఒకటి మాత్రం నేను ఇక్కడ చెప్పాలి. మిగిలిన మంత్రులు తమ పార్ల మెంటరీ సెక్రటరీలకు, ప్రకాశంగారు నాకు ఇచ్చినట్లు అవకాశాలు ఇచ్చేవారు కారు. అలా ఇచ్చిన అవకాశాలను నేను సద్వినియోగ పరచినట్లే సభలో అందరూ భావించేవారు. ఈ విషయంలో, కేంద్ర లోక్‌సభ లోను, రాజ్యసభ లోను ఉన్న పద్ధతి. ఈ రాష్ట్ర శాసన సభలో పద్ధతికి భిన్నంగా ఉంటుంది. మంత్రి అక్కడే ఉన్నప్పుడు కూడా ఉప, సహాయ మంత్రులు జవాబు లివ్వడానికి అభ్యంతరంలేదు. అంతే కాదు. వారే ప్రథమంలో సచివాలయంవారు వ్రాసి నికరం చేసిన ప్రత్యుత్తరాన్ని చదువుతారు. అవసరం వచ్చినపుడు మంత్రి కూడా చేచి ప్రత్యుత్తరాన్ని విపులపరుస్తాడు. శాసన సభలో ఉపన్యాసా లిచ్చేటప్పుడు ప్రకాశంగారు మంద్ర స్వరంలో మెల్లిగా మొదలుపెట్టి తూచి తూచి మాట్లాడినా, ఉపన్యాసం గడచిన కొద్దీ వాక్యాలు వేగం అందుకుని అవసరాన్నిబట్టి ఉచ్చమైన స్వరంలోకి వెళ్ళడం జరిగేదని ఇదివరకే వివరించాను. తాను మాటాడుతున్నపుడు ఇతర సభ్యులెవరైనా విమర్శనా పూర్వకంగా ఏదైనా మధ్యలో అంటే, ఆయన దాన్ని వెంటనే అందుకుని, దాని జవాబును కూడా తన వ్యాఖ్యానంలో కలప గలిగేవారు. ఒక రోజున శాసన సభలో జమీందారీ ఎంక్వయరీపై మాట్లాడే సందర్భంలో "పెర్మనెంట్ సెటిల్మెంటు రెగ్యులేషన్లోగల భాషయొక్క అర్థం ప్రీవీ కౌన్సిల్‌వారు