పుట:Naajeevitayatrat021599mbp.pdf/650

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాసన సభలో ప్రశ్నలకు జవాబులు

శాసన సభా కార్యక్రమం నడిపించడానికి, నామీద ప్రత్యేకమైన అభిమానముంచి, ఉత్తర ప్రత్యుత్తరాలు ఇచ్చే సమయంలో (అంటే ప్రతి దినం మొదటిగంట యావత్తూ) ఆయన పని నాకు అప్పజెప్పి, అవతల ఉండేవారు ప్రకాశంగారు. అలా అవతల ఉండవలసిన అగత్యం స్పీకరు సాంబమూర్తిగారివల్ల కలిగింది. ప్రకాశంగారు మొదట, ఒకటి రెండు రోజులు ప్రశ్నలకు జవాబులు చెప్పి, తర్వాతనే పార్లమెంటరీ సెక్రటరీని కాబట్టి ఆ జవాబులు నన్నే చెప్పమ న్నారు. దానిపైన సాంబమూర్తిగారు ఒక రూలింగు ఇచ్చారు. ఆ రూలింగు ప్రకారం మంత్రి గారు సభలో హాజరయిఉంటే, పార్ల మెంటరీ సెక్రటరీ ప్రశ్నలకు జవాబు చెప్పరాదు. అయితే, ప్రకాశంగారు దానికి జవాబుగా "ఇకమీద ప్రశ్నల సమయంలో నేను అవతల ఉండి, మిగిలిన కార్యక్రమం ఆరంభమయ్యేసరికి వస్తుంటాను. ప్రశ్నలకు జవాబులు పార్ల మెంటరీ సెక్రటరీయే ఇస్తుంటా" డని చెప్పి, ఆరోజు కాగితాలు నా చేతిలో ఉంచి, అవతలకు వెళ్ళారు.

ఇది ఇలా జరుగుతుండగా, అనవసరమైన ఒక చిన్న విమర్శ ఒక చిన్న వార పత్రికలో ఎవరో వ్రాశారు. అందులో, ప్రశ్నోత్తర సమయంలో ప్రకాశంగారు తప్పుకోవడమే బాగుందనీ, ఆయన పార్ల మెంటరీ సెక్రటరీయే కార్యక్రమమంతా ప్రశంసనీయంగా నడిపిస్తున్నారనే భావం ఉండి. అయితే, ఈ విషయం నేను మొదట చూడలేదు. మామూలుగా నాకు వచ్చే ప్రశ్నలకు సంబంధించిన ఫైళ్ళు ఒక రోజు నా వద్దకు రాలేదు. గుమాస్తాలు పంపడం మరచిపోయినా రేమోనని, నేను ప్రకాశంగారి యింటికి వెళ్ళాను. ప్రకాశంగా రప్పుడు భోజనం చేస్తున్నారు. కచ్చేరి గది బల్లపైన, ఒక వారపత్రికలోని వ్యాసం - మార్జినులో ప్రక్కగా ఎర్ర గీత ఉన్న దానిని నేను చూశాను. ఏదో పరిపాలనా విషయమేమోనని చూస్తే, అది ప్రశ్నోత్తరాలకు సంబంధించి నేను ఇంతకు ముందు పేర్కొన్న వ్యాసమే. ఆ కాగితం నేను తిరిగి అక్కడే ఉంచేశాను. ప్రశ్నలకు సంబంధించిన ఫైళ్ళు ఆ