పుట:Naajeevitayatrat021599mbp.pdf/643

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తనతో వెళ్ళే వారిని తీసుకు వెళ్ళవచ్చుగాని, పత్రికలలో ప్రచురించడం ఎందుకయ్యా?" అని చలోక్తిగా అన్నారు.

ఈ ఉదంతమయిన తర్వాత సాంబమూర్తిగారు చాలా ఖిన్నులయినారు. కాని, సభా కార్యక్రమంలో అదేమీ కనపడ నివ్వలేదు.

డాక్టర్ లక్ష్మీపతిగారి కేసు

నేషనలిస్టు పాలన నడుస్తున్న రోజులలో, డాక్టర్ లక్ష్మీపతిగారు ఆరోగ్యవరంలో ఆరోగ్య కేంద్రం విస్తరింపు నిమిత్తమై ప్రభుత్వం వారి సహాయం కోరారు. అప్పటి మంత్రివర్గం నేషనలిస్టు అనుకునేవారు. ఆరోగ్యశాఖామంత్రి అయిన ముత్తయ్య మొదలియార్ అనే ఆయన ఆరోగ్యవరం వెళ్ళిచూచి, ఆ సంస్థ బాగా జరుగుతున్నట్టూ, ప్రభుత్వ సహాయం పొందడానికి అర్హత కలిగి ఉన్నట్టూ వ్రాసి, ఏడువేల రూపాయలు మంజూరు చేశాడు.

డాక్టర్ లక్ష్మీపతి (బి. ఎ., ఎం. బి. బి. ఎస్.,) ఇంగ్లీషు డాక్టరు అయినా ఆయుర్వేదంలో గట్టి నమ్మకం కలవాడు. ఇంతేకాక, పెద్ద సంఘ సంస్కర్త. ఆయన భార్య రుక్మిణమ్మగారు సహాయ నిరాకరణోద్యమంలో పూర్ణంగా దిగి, పనిచేసిన మనిషి.

ఈ పరిస్థితులలో ముత్తయ్య మొదలియార్‌ గారు మంజూరుచేసిన ఆ గవర్నమెంటు ఆర్డరు డిస్పాచ్ శాఖకు వెళ్ళింది. ఆ శాఖ ఉద్యోగికి -- ఆర్డర్లను రిజిస్టరులో ఎక్కించి, అది ఎవరికి పంపాలో వారి అడ్రసు వ్రాసి స్టాంపు అంటించి పంపించడమో; ఊళ్లోనే ఉన్నవారయితే మనిషిద్వారా పంపించడమో పని. అయితే, అక్కడ డాక్టర్ లక్ష్మీపతిగారికి, ఆ ఆర్డరు పంపే విషయమై పనిచేసే డిస్పాచ్‌గుమస్తా బ్రిటిషు గవర్నమెంటుకు ప్రియుడు కాబోలు! ఆ ఆర్డరు డిస్పాచ్ చేయక, ఇంకొక కాగితంపైన పిటిషనరయిన లక్ష్మీపతిగారి భార్య అయిన రుక్మిణమ్మగారు ఉప్పు సత్యాగ్రహంచేసి అరెస్టయి జెయిలు శిక్ష పొందడంవల్ల, ఆమె భర్త అయిన లక్ష్మీపతిగారికి ప్రభుత్వం