పుట:Naajeevitayatrat021599mbp.pdf/642

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అడగడానికి వెళ్ళవలెనని అనుకున్నారు. ఈ రోజుల్లో ఇటువంటి ప్రయాణాలు అతి తరచుగా జరుగుతున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కావలసిన మొత్తాలను అభ్యంతరం లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. కాని, కాంగ్రెసు అధిష్ఠానవర్గం ప్రసక్తే ఉండదు. అయితే, 1937లో పద్ధతి వేరు. సాంబమూర్తిగారు వెళ్ళడానికి ముఖ్యమంత్రి రాజాజీ అంగీకరించి శాసన సభలో - ఆయన సుఖంగా వెళ్ళి తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ తీర్మానం ప్రవేశ పెట్టారు. తీర్మానం చర్చ జరిగే సమయానికి కాంగ్రెసు అధిష్ఠానవర్గం దగ్గరనుంచి రాజాజీకి ఒక లేఖ వచ్చింది. వచ్చినా, విప్పి చూసుకోలేదని తర్వాత ఆయన చెప్పారు. శాసన సభలో ఆయన, ఆయనతోబాటు ప్రతిపక్ష నాయకులు సాంబమూర్తిగారిని ప్రశంసిస్తూ జోరుగా ఉపన్యాసాలు సాగించారు. అయితే మర్నాడు పత్రికలలో సాంబమూర్తిగారు ఇంగ్లండు వెళ్ళడానికి వీలులేదని అధిష్ఠానవర్గంవారు ఆదేశించి రాజాజీకి సందేశం పంపినట్లు వార్త పడింది. తమ ఆదేశానికి అద్జిష్ఠాన వర్గంవారు ప్రధాన కారణం చూపించారు. అది: స్పీకరు పదవిలో ఉన్న వ్యక్తి పరాయి ప్రభుత్వాన్ని ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయవలసిందని యాచించడానికి వెళ్ళగూడదు! దానిపై, సాంబమూర్తిగారు ఆ పదవికి రాజీనామా ఇచ్చి వెళతా మన్నారు. అందుకు అధిష్ఠాన వర్గంవారు తమ అనుమతి లేకుండా రాజీనామా ఇచ్చి పార్టీకి ఇబ్బంది కలిగించడానికి వీలులేదన్నారు. ఇంతేకాక, కాంగ్రెసు నాయకులలో అగ్రశ్రేణిలో ఉన్న సాంబమూర్తిగారి వంటివారు యాచనకై పరప్రభుత్వ ప్రాంగణంలో పాదం మోపకూడ దన్నారు. ప్రకాశంగారు, నాతో ఈ విషయం ముచ్చటించి నపుడు, దీనికి కారణాలు వేరు అని చెప్పారు. ఆయన "మొట్ట మొదట అధిష్ఠానవర్గంవారు తమకు ఇది చెప్పక పోవడం తమ పలుకుబడికి న్యూనత అనుకున్నారు. రెండవది - ఈ 'సాంబమూర్తి' తనతో ఎవరెవరిని తీసుకు వెళుతున్నాడో వారిపేర్లు పత్రికలలో పడేలాగున ముచ్చటించాడు. ఆ వెళ్ళే వారిపైన మన చెన్నపట్నంలోనే ఒకరిద్దరికి ఇష్టంలేదు. అసలు ఈ వ్యతిరేకపు సలహా చెన్నపట్నం నుంచే బయలుదేరిందని నా నమ్మకము, అయినా