పుట:Naajeevitayatrat021599mbp.pdf/641

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"నీవు ఈ రోజునైతే ఇలాగు వచ్చావు కాని, ఇటువంటి పాడుపని ఇటుపైని తలపెట్టి చెడిపోకు వెంటనే వెళ్ళిపో," అని చెప్పేసరికి ఆ పెద్ద మనిషి తాను చెప్పవచ్చిన పని మాట మాని, మరేమీ చెప్పక వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఆరోజు, తర్వాత నేను, ప్రకాశంగారు కలసి కోటలో ఆఫీసుకు వెళ్లే సమయంలో త్రోవలో ఆ మార్వాడీ పెద్దమనిషి నాకు డాల్మియా విజ్ఞప్తి విషయమై చెప్పడానికి వచ్చాడని చెప్ప నారంభించేసరికి, "ఆ దుర్మార్గుణ్ణి ఎందుకు రానిచ్చావు?" అని మందలించినట్టు అన్నారు ప్రకాశంగారు. తర్వాత ఆయన నేను పైన చెప్పిన ఉదంతం పూసగ్రుచ్చినట్లు చెప్పారు. తర్వాత, నేను ఖాసా సుబ్బారావుతో "అటువంటి మార్వాడీని నువ్వెలా తీసుకొవచ్చా వయ్యా?" అని యథాలాపంగా అడిగితే, "నువ్వు కూడా రావలసిందని నాతో అంటే నేను వచ్చాను. అతని పనికి నాకు సంబంధం లేదని పక్కకు పిలిచి నీకు చెప్పాను గదా? ఎటొచ్చీ ప్రకాశంగారింటి దగ్గర అలా ప్రవర్తిస్తాడని ఊహించలేక పోయాను," అని విచార పూర్వకంగా చెప్పాడు. సచివాలయంలో ఈ వజ్రపు గని హక్కు విషయమై ప్రకాశంగారికి ముఖ్యమంత్రిగారికి చాలా వివాదం పెరిగింది. అయితే, ఆ డాల్మియా చాలా గడుసువాడు కావడంతో, ప్రకాశంగారికి తెలియకుండా గిరిధర దాస్ నారాయణ దాసుకు ఏదో వాటా ఇవ్వడానికి రహస్యంగా ఒప్పుకున్నట్టు తెలిసింది. గిరిధరదాస్, ప్రకాశంగారితో తనపైన ఒత్తిడి చాలా ఉండడంచేత తన పిటీషన్ ఉపసంహరించు కున్నట్టు చెప్పాడు. ఆంధ్రా కాంగ్రెస్ కమిటీ సిపారసుపైన స్టేటు కౌన్సిలుకు సభ్యుడుగా వెళ్ళిన ఆ పెద్ద మనిషి ఇలాంటి రహస్య వ్యవహారం చేసుకోవడం ప్రకాశంగారి కిష్టంలేక పోవడంతో, ఆయన విముఖులై, అతని విషయమై తర్వాత ఏ విధంగానూ కలుగచేసుకోలేదు.

సాంబమూర్తిగారి ఇంగ్లండు ప్రయాణ భంగము

1937 లో స్పీకర్ సాంబమూర్తిగారు ఇంగ్లండులోని హౌస్ ఆఫ్ కామన్స్ కార్యపద్ధతి చూచేందుకు, పార్ల మెంటరీ విధానాలూ పరిశీలించేందుకు, ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయమని బ్రిటిషు ప్రభుత్వాన్ని