పుట:Naajeevitayatrat021599mbp.pdf/638

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అమ్మకపు పన్ను చట్టం

ఇక, సేల్స్‌టాక్సు (అమ్మకపు పన్ను) బిల్లు విషయమై ఒక విషయం చెప్పాలి. సేల్సుటాక్సు వల్ల రెవిన్యూ అధికమవుతుంది. కానీ, ప్రకాశంగారి చేతిలోంచి రెవిన్యూకు సంబంధించిన యీ విషయం (సబ్జక్టు) ముఖ్యమంత్రిగారు తమ చేతిలోకి తీసుకోవడమే కాక, ఇందులో ఇంగ్లీషు వర్తకులకుగల సౌకర్యాలు స్వదేశవర్తకులకు కలిగించకుండా బిల్లు నడిపిస్తున్నట్టుగా కింవదంతులు బయలుదేరాయి. ప్రకాశంగారు ఒక రోజున పట్టలేక వెళ్ళి సెలక్టు మీటింగులో కూర్చున్నారు. అప్పుడు రాజాజీ చాకచక్యంగా, "ఈ బిల్లు ప్రకాశం గారు నడిపించ వలసింది. నా చేతి కప్పగించడం వల్ల నేను చేస్తున్నాను గాని," అని తొణుకు బెణుకు లేకుండా సభ్యులకు చెప్పారు. కాదనడానికి, అవుననడానికి వీలుకాని సమయం గనుక ప్రకాశంగారు ఊరుకోవలసి వచ్చింది. కాని, అప్పుడు స్వదేశ వర్తకులకు అన్యాయం జరుగ కూడదని ఆయన ఒక మారు గట్టిగా చెప్పడంవల్ల ఆ బిల్లులో భాగాలు కొంత సర్దుబాట యినాయి. అలాగే, ఋణ విమిక్తి బిల్లు విషయంలో కూడా బోర్డు ఆఫ్ రెవిన్యూవారు ప్రకాశంగారి ప్రమేయం లేకుండా ఒక బిల్లు తయారు చేస్తున్నట్టు, గవర్నరు ప్రకాశంగారితో మాట్లాడిన సందర్భంలో తెలిసింది. ఇటువంటిది ఎలా సాధ్యము? రాజాజీ ముఖ్యమంత్రి అయినపుడు మాత్రమే సాధ్యం అవుతుంది. ఈ విషయమై ప్రకాశంగారు రాజాజీని అడిగారట. "వాళ్ళేదో వ్రాసుకుంటారు. మనకేమి సంబంధ"మని ఆయన అన్నారట. రెవిన్యూకు చెందిన ఈ ఋణ విముక్తి శాసనాన్నీ రాజాజీయే ఉంచుకున్నారు. ఈ విషయాలు మంత్రివర్గం ఏర్పాటయిన కొద్ది కాలంలోనే జరగడంవల్ల, మంత్రి మండలిని చికాకుపరచడం ఇష్టంలేక ప్రకాశంగారు - జాయింట్ రెస్పాన్సిబిలిటీ అనే సూత్రం నాశనమయి పోతున్నదని మాత్రం తన మినిట్లో వ్రాసి, అంతటితో ఆ విషయం చాలించుకున్నారు. ప్రకాశంగారి అభిప్రాయం ప్రకారం ఋణ విముక్తి శాసనంలో ఋణం తగ్గింపు విషయం మాత్రం ఏర్పడితే చాలదనీ, ఋణం తీర్చే విధానం పట్ల