పుట:Naajeevitayatrat021599mbp.pdf/635

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాదం హెచ్చడంచేత, ఆ బిల్లు కార్యరూపం ధరించలేదు. అలాగే మునిసిపల్ చైర్మన్లకు (పురపాలక సంఘ అధ్యక్షులకు) హెచ్చు అదికారాలు ఇవ్వాలని ప్రకాశంగారు తయారు చేసిన బిల్లుకూడా కార్యరూపం పొందలేదు. అసలు రెవిన్యూమంత్రికి వాటితో సంబంధ మేమిటనీ, ప్రభుత్వ కార్య నిబంధనలలో దానికి సంబంధించిన శాఖవారు తప్ప ఇతరు లీ ప్రమేయం పెట్టుకోరాదని వారు అడ్డుపెట్టారు. అందుచేత ముఖ్యమంత్రి కూడా వాటి విషయమై తూష్ణీంభావం వహించారు. పబ్లిక్ వర్క్స్ విషయంలో కూడా, పి. డబ్ల్యూ. డి. అంటే పబ్లిక్ వేస్ట్ డిపార్ట్‌మెంట్ అని నలుగురూ అనుకునే మాట సత్యమైనదే నని ప్రకాశంగారి అభిప్రాయం.

మేము ఒకమారు బుక్కరాయపట్నం వెళ్ళడం తటస్థించింది. రాయల రాజ్యంనాటి రాతితో కట్టిన పెద్ద చెరువొకటి అక్కడుంది. ప్రకాశంగారు, నేను వెళ్ళినపుడు వృద్ధులైన కొందరు రైతులు వచ్చి, కొంచెం దూరంలో ఒక కొండవాగు ఉందనీ, దాని ద్వారా ఈ చెరువు నిండేదనీ, సెటిల్మెంటు సమయంలో ఈ చెరువు నీటి వనరు గలవిగా అనేక భూములను వ్రాసి ఉన్నారనీ, అయితే ఆ వాగు పూడిపోవడం వల్ల ఈ చెరువు ఎండిపోతున్నదనీ, దాని మరమ్మత్తుకు పదివేలరూపాయలు అవుతుందనీ, కాని పి. డబ్ల్యూ. డి. వారు మరమత్తుకు లక్షల కొద్ది అవుతుందనీ, తగిన రాబడి లేనందువల్ల ఆ పని చేయం అనడం వల్ల పదిహేను, ఇరవై ఏండ్ల నుంచి పాడుపెట్టి ఉంచిన భూములను, ఎండిన చెరువునూ మాకు చూపించి గోలపెట్టారు. ప్రజలు అనుకున్న లెక్కకు, పి. డబ్ల్యూ. డి. ఇంజనీరు వేసిన లెక్కకు పదింతల వార ఉంది. దానిపైన రైతులు ఆ పని తమకు అప్పగిస్తే, తమ లెక్కకు సరిపడేటట్లు ఆ కాలువను మరమ్మతు చేసుకుంటామని కోరగా, అతి కష్టంమీద ఇంజనీరు అభ్యంతరం పెట్టనని అనుమతించాడు. అదే ఒక బ్రహ్మాండమయిన సాయంక్రింద రైతులు సంతోషించారు.

తిరిగి సంవత్సరం తర్వాత ఏం జరిగిందో చూడడానికి ప్రత్యేకంగా మేము అక్కడికి వెళ్ళాము. చెరువునిండా నీరు, ఆ నీటి కెరటా