పుట:Naajeevitayatrat021599mbp.pdf/623

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చింది. అన్ని జిల్లాల్లోంచి జమీందారీ రైతులు గుంపులు గుంపులుగా చెన్నపట్నం చేరుకున్నారు. చర్చ ఆరంభించడానికి రెండుగంటల ముందే సభామందిరపు ఆవరణమంతా వారితో నిండిపోయింది.

4

శాసన సభా విశేషాలు

మంత్రివర్గం ఏర్పాటయిన తర్వాత మొదటి శాసన సభా కార్యక్రమపు ఉదంతాలు ఇక్కడ కొంచెం వ్రాస్తాను. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్టు ననుసరించి శాసన సభ విస్తృతమైంది. ఫోర్టు సెంటు జార్జిలో అప్పటి వరకూ ఉన్న శాసన సభా భవనం విస్తృతమైన శాసన సభకు సరిపోదు గనుక, కొత్తగా పెద్ద భవనం ఒకటి కోటకు దక్షిణంగా ఉన్న ఐలెండుగ్రౌండు అనే పెద్ద మైదానంలో తూర్పు భాగాన నిర్మించడానికి అప్పుడు ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు. ఆ భవనానికి ప్లానులు, డిజైనులు తయారుచేయడానికి కొన్ని లక్షల రూపాయలు ఫీజుగా ఎవరో ఆర్కిటిక్టులకు ఇవ్వడం కూడా జరిగింది. కాని, కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత, ఐలెండ్ గ్రౌండును రాయి, సున్నం కట్టడాలతో నింపివేయడం ఇష్టం లేక, ఈ శాసన సభను తాత్కాలికంగా సెనేట్ హాలు అనే భవనంలో నడప డానికి ఏర్పాటు జరిగింది. ఫోర్టు సెంటుజార్జికి దక్షిణంగా కూవమ్ నది ఉంది. అప్పట్లో కూవం ఒడ్డున క్లైవ్ హవుస్ అనే భవనం ఉండేది. అది ఇప్పుడు మద్రాసు యూనివర్శిటీ లైబ్రరీగా పునర్నిర్మింప బడింది. దానికి దక్షిణంగా పెద్ద మైదానంలో (ఇప్పటి యూనివర్శిటీకి సంబంధించిన నిర్మాణాలు అప్పట్లో లేవు.) పెద్ద పెద్ద గుమ్మాలతో సెనేట్ హాలుంది. యూనివర్శిటీలో పాసయిన వారికి డిగ్రీలు ఇవ్వడానికి ఆ హాలు నిర్మింపబడి ఉండెను. ఆ హాలు మేడ పైభాగంలో శాసన సభ ఆఫీసులు, దాని భూగర్బ భాగంలో శాసన సభ గ్రంథాలయం