పుట:Naajeevitayatrat021599mbp.pdf/615

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్పృడెన్స్. దాని ప్రకారంగా, భూమి హక్కు రైతుది. ఉపరిభాగంలో దాని గర్భంలో అతని భూమి పరిమితి మధ్యగలదాని సర్వ సంపూర్ణమైన హక్కు రైతుది రైతు రాబడిలో ఒక నిర్ణీత భాగంపైనే ప్రభుత్వానికి హక్కుంది. కాని. ఐ. సి. యస్. ఉద్యోగులు చదువుకొన్నది ఇంగ్లీషు జ్యూరిస్ స్పృడెన్స్. దాని ప్రకారం భూమి హక్కు ప్రభుత్వానిది. రైతుకు పన్ను చెల్లించి, దున్నుకొనేందుకు మాత్రమే హక్కు కలదని దాని తాత్పర్యము. అందుచేత, ప్రశ్నలలో చాలా భాగం ఈ హక్కుల నిర్ణయం పైనే ఆధారపడి ఉండడంచేత మొదటి ప్రశ్నగా, "ఈ భూమి హక్కు జమీందారుదా? రైతుదా? మీ అభిప్రాయం చెప్పవలసిన"దని నేను వ్రాశాను. ఎందుకైనా మంచిదని ప్రకాశంగారికి ఈ ప్రశ్నను గురించి చెప్పాను. అసలు ఉర్లాము కేసు ఈ హక్కుపైన ఆధారపడిందే కాబట్టి, "అలాగే కాని"మ్మన్నారు. దానిపైన మిగిలిన అనుబంధ ప్రశ్నలు, నీటి వనరుల సౌకర్యాలు, శిస్తులు హెచ్చింపు తగ్గింపుల విషయాలు, జమీందారీలోగల కొండలు, అడవులు నీటి సరఫరా విషయాలు, జమీందారులకు రైతులకూ ఉన్న సామరస్య వైషమ్య సంబంధాలన్నీ పరిశీలించేందుకు శాసన సభ్యులుగల ఒక ఉప సంఘాన్ని నియమించడానికీ, వారి రిపోర్టు శాసన సభకు అందజేయవలసినదిగానూ శాసన సభలోను, శాసన మండలిలోను ప్రకాశంగారు తీర్మానాన్ని ప్రతిపాదించారు. నిబంధనల ప్రకారం ఆ కమిటీ సభ్యుల పేర్లు, వారు పరిశీలించవలసిన విషయాల స్థూలమైన వివరాలు ఆ తీర్మానంలోనే ఉన్నవి.

ఈ ఉప సంఘం కొన్ని ప్రశ్నావళులను పత్రికల మూలంగా ప్రకటించి, రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైన కేంద్రాలలో సాక్ష్యములు తీసికొని చర్చలు జరిపి, రిపోర్టు తయారుచేసి, దానిపై సంతకము చేయడానికి సహజంగానే కొంతకాలం పట్టినది. 1938 నవంబరులో ఈ రిపోర్టు శాసన సభకు అందజేయడమైనది. 1939 జనవరి, ఫిబ్రవరి నెలలలో ఉభయ శాసన సభలు నివేదికను, అందులో పొందుపరచిన బిల్లులను ఆమోదించడం జరిగింది. అయితే, దురదృష్టం కొద్దీ అవి