పుట:Naajeevitayatrat021599mbp.pdf/609

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాకు ఆయన పైన ఉన్న అనుమానం చెప్పి, "నేను పైలు చదవకపోతేనే ఆయనకు శ్రేయస్కర" మని చెప్పాను. ప్రకాశంగారు "అయితే సరే! నేనే చదువుకుంటాను కాని, ఆ ఛార్జీషీటు ఏమిటో చూడు" అన్నారు. ఆ పొడుగైన ఛార్జీషీట్లో లంచగొండితనం విషయమై ఒక్క ఛార్జీకూడా లేదు. ఆ సంగతే ప్రకాశంగారికి చెప్పాను. "సరే, అయితే అతనిని బయట పడేద్దా" మని ఆయన అన్నారు. ఈ వ్యవహారం కాబినెట్ లోకి వెళ్ళింది. దాదాపు మంత్రులందరూ ఈయన పేరు వినేసరికి మంత్రిచెప్పిన ప్రకారం ఉద్యోగంనుంచి బర్తరపు చేయాలనే ఉద్దేశాన్ని వెల్లడించారు. గిరిగారు మాత్రం ప్రకాశంగారికి ఎప్పటివలె అనుకూలురుగా ఉండిరి. ప్రకాశంగారు ఛార్జీ లన్నింటిని క్రిమినల్ అప్పీళ్ళు వాదించినట్లు వాదించి, సాంకేతికమైన విషయాలలో మంత్రికీ, ఉద్యోగికీ భేదం వచ్చినంత మాత్రాన ఉద్యోగిని బర్తరపు చేయడం మహా అన్యాయం అని వాదించి - కాబినెట్ అధ్యక్షుడుగా కూచున్న గవర్నర్ మనసు మార్చ గలిగారు. దాంతో, చల్లగా మిగిలిన మంత్రులుకూడా మారారు. కాని, అందరి మనసుల్లోను ఆ ఉద్యోగి డబ్బు వ్యవహారంలో మంచివాడు కాడని ఒక అభిప్రాయం గట్టిగా ఉండడంవల్ల ఎలాగైనా అతనిని ఉద్యోగంనుంచి తీసివేయాలని పట్టు పట్టారు. ప్రకాశంగారే ఒక రాజీమార్గం, పైకి శిక్షలా కనిపించేటట్లుగా రూపొందించారు. ఆ ఉద్యోగి తన ఉద్యోగకాల పరిమితి వరకు ఉద్యోగంచేస్తే అతనికి అందే వేతనం, మిగిలిన ఉద్యోగ విరమణ సంబంధమైన అన్ని లాభాలు కలిగిస్తూ అతనిని ఉద్యోగంనుంచి అప్పుడే విరమించుకొనేటట్లు చేయటమే అది. అంటే - ఆ ఉద్యోగి మరొక నాల్గు, ఐదు సంవత్సరాలు పనిచేయకుండానే ఆ జీతం మొత్తం, ఆ తర్వాత వచ్చే ఉద్యోగ విరమణ లాభాలు పొందగలిగాడు. ఆ రోజు కాబినెట్ మీటింగ్ కాగానే ప్రకాశంగారి గదిలోకి వచ్చి గిరిగారు నాతో అన్నారు: "విశ్వనాథంగారూ! ప్రకాశంగా రీ రోజున కాబినెట్‌ను క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ క్రింద మార్చివేశారు. మరొక పర్యాయం ఆయన క్రిమినల్ న్యాయవాది నైపుణ్యాన్ని విజృంభింపజేశారు. ఆ