పుట:Naajeevitayatrat021599mbp.pdf/606

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వైద్యునిగా చెప్పకోదగ్గ ప్రాక్టీసు ఉండేది. ఒకప్పుడు లెప్టినెంట్ కర్నల్ శాస్త్రి, డిస్ట్రిక్టు మెడికల్ ఆఫీసరుగా పనిచేయడం తటస్థించింది. ఆయన గవర్నమెంటు ఉద్యోగి, రాజన్ ప్రైవేట్ ప్రాక్టీషనరు. వారిద్దరిమధ్య ఏవైనా తగాదాలు రగుల్కొనేందుకు కారణాలు ఉండి ఉండ వచ్చును. కాలం కలిసివచ్చి రాజన్ మంత్రి అయ్యాడు. లెఫ్టినెంట్ కర్నల్ శాస్త్రి మెడికల ఉద్యోగి కావడంచేత, ఆయన రాజన్ ఆధిపత్యంలో ఉండడం జరిగింది. శాస్త్రికి, అకస్మాత్తుగా ఒకరోజున, ఉద్యోగంలో నుంచి తనను ఎందుకు తీసివేయకూడదో తెలుపవలసిన దంటూ నోటీసు ఒకటి అందింది. అందులో ఉన్న ఛార్జీ ఇది: ఆయన ఒక రోజున ఆస్పత్రిలో ఒక నర్సును బలవంతంగా ఒక ప్రక్కకు లాక్కొని వెళ్ళాడని.

అంతకుముందు జరిగినది ఇది: ఎవడైనా ఉద్యోగి ప్రమోషన్ పొందడానికి సిద్ధంగా ఉన్నా డన్న సమయంలో ఇటువంటి అర్జీలో, లేక లంచం పుచ్చుకొన్నాడని పిటీషనులో రావడం మామూలు. లెఫ్టినెంట్ కర్నల్ శాస్త్రి ఏదో పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళే సమయ మది. ఆయన కాన్ఫిడెన్షియల్ పైలులో ఈ చార్జీ ఎంక్వయిరీ తేలేవరకు, ఆయన ప్రమోషను ఆపుదల చేయడ మైనదన్నమాటకూడా మొదట వ్రాసి ఉంది. తరువాత ఎంక్వయరీ సంపూర్ణంగా జరిగింది. ఆపైన, ఆయన మీద మోపిన నేరం అభూతకల్పన అని తేలింది. ఆయన ప్రమోషన్‌మీద ఈజిప్టు వెళ్ళడానికి అభ్యంతరం లేదనీ తేలిపోయింది. ఇదికూడా కాన్పిడెన్షియల్ పైలులో వ్రాయ బడటంతో ఆయన ఆ ఛార్జీనుంచి గౌరవంగా విముక్తుడయ్యాడని పేర్కొనబడింది.

ఇలా ఉండగా, రాజన్‌గారు అదే ఛార్జీని వివరిస్తూ, తనను ఎందుకు డిస్మిస్ చేయరాదో చెప్పుకోమని శాస్త్రికి నోటీస్ ఇప్పించారు. మీద చెప్పిన సంగతులన్నీ నేను స్వయంగా ఫైలు చూసిన తర్వాత తెలిసినవి. ప్రకాశంగారు, మేము 1938 లో వేలూరు జెయిలులో ఉన్నపుడు శాస్త్రిగారు మూడుమారులు జెయిలుకు వచ్చి మమ్మల్ని చూసి ఉన్నారు. ఆయన ప్రకాశంగారితో తనకు వచ్చిన నోటీస్