పుట:Naajeevitayatrat021599mbp.pdf/602

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోయిన జస్టిస్ పార్టీకి చెందిన ప్రముఖుడు సర్. కె. వి. రెడ్డినాయుడు ముఖ్యమంత్రి. విజయనగరం రాజా ఆయనకు తన ఎస్టేటు విడుదల చేయాలని, తనను వ్యక్తి సంరక్షణనుంచి విడుదల చేయాలని విజ్ఞప్తి పంపారు. అలా విడుదల చేస్తే వెంటనే గవర్నమెంటు పైన విజయనగరం రాజా దావా వేయడానికి అవకాశముందనీ, అందుచేత ఎంత మాత్రమూ విడుదల చేయడం దుస్సాధం (impossible) అనీ తేల్చారు. రెడ్డినాయుడుగారు ఆ సలహా ప్రకారంగానే తమ అభిప్రాయాన్నీ వ్రాశారు. దాన్ని అనుసరించి గవర్నరుగారు ఆ పైలు మీద "Impossible" అని వ్రాశారు. ఇలా ఉండగా కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడడం, ప్రకాశంగారు రెవిన్యూ మంత్రి కావడం సంభవించాయి. వెంటనే విజయనగరం రాజా ప్రకాశంగారికి మరో విజ్ఞప్తిని, లోగడ ఇంటెరిమ్ మినిస్ట్రీకి పంపించిన రీతిగానే పంపించారు. అదే పద్ధతిలో కోర్ట్ ఆఫ్ వార్డ్స్‌వారు ఇప్పుడు కూడా అభ్యంతరాలు పెడదా మనుకున్నారు. అయితే, ప్రకాశంగారు చోటివ్వలేదు. ఈ విజ్ఞప్తి వచ్చిన వెంటనే బోర్డ్ ఆఫ్ రెవిన్యూ ప్రథమ మెంబరుకు రావలసిందని కబు రంపారు. ప్రథమ మెంబరైన హాల్వ్ దొరవచ్చి, పాతకథ మొదలుపెట్టబోగా, ప్రకాశంగారు సూటిగా ఒక ప్రశ్నవేశారు. "విజయనగరం రాజా చనిపోయే లోపున మీ ఆలోచన పూర్తవుతుందా? లీగల్ అభ్యంతరాలు (విధి సంబంధ అభ్యంతరాలు) తేలుతాయా? ఒక మనిషికి ప్రాణ రక్షణ చేయడానికి ఏ శాసనం మిమ్మల్ని అడ్డుతున్నది?" అని అడిగారు. ప్రాణ రక్షణ అనే మాట వినేసరికి హాల్‌కి ఒక నూతన దృక్పథం గోచరించింది. ఆయన ఆయన అన్నారు కదా - "ప్రాణ విషయమంటూ మీరు చెప్పింది ఒక క్రొత్త దృక్పథము. ఆయనకు ఏదైనా ప్రమాదం జరిగిన యెడల ఆ బాధ్యత భరించడం కష్టం అనేది ఇప్పుడు గ్రహించ గలిగాను. వెంటనే కోర్టు సంరక్షణనుంచి రాజాను విడుదల చేస్తూ ఆర్డరు ఇప్పుడే మీరు చెప్పినట్లు పంపుతాను."

ప్రకాశంగారు రాజాను కోర్టు సంరక్షణనుంచి విడుదల