పుట:Naajeevitayatrat021599mbp.pdf/598

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిబంధనల ననుసరించి ఈయన సాధించగలిగింది కూడా ఏమీ లేదనీ రెవిన్యూశాఖ అప్పచెప్పిన వారి అభిప్రాయం కాబోలు!

కాబినెట్ మీటింగు

రాజాజీ చాల నిపుణుడు. దానికి తోడు మహాత్మాగాంధీగారికి సంబంధి. గాంధీగారు మొదటిసారి జైలులో ఉన్న రోజులలో ఆయన నడిపించే "యంగ్ ఇండియా" పత్రికను జాగ్రత్తగా నడిపించిన వాడు. గాంధీ తత్వం ఆయనకు తప్ప మరొకరికి అంత సంపూర్ణంగా ఒంట బట్టలేదని పేరుపడిన ఆయన.

1937 లో ఎన్నికలలో గెలిచిన వెంటనే కాంగ్రెసువారు మంత్రి మండలులు ఏర్పాటు చేయడానికి అంగీకరించలేదు. దీనికి కారణం - అనేక విషయాలలో గవర్నరుకు మంత్రివర్గం చేసే తీర్మానాల్ని త్రోసిపుచ్చడానికి కొన్ని అధికారాలు కూర్పబడి ఉండడము. అట్టి సందర్భంలో కాంగ్రెసు వారు మంత్రులుగా కార్యనిర్వహణ ఏలాగున జరుపగలరు? అలాగని చెప్పి మంత్రివర్గాలు తాము ఏర్పాటు చేయకపోతే రాష్ట్రాల పరిపాలన బాధ్యతా రహితులైన గవర్నర్ల చేతులలోనికి పోతుంది. అంటే, వారు దేశస్వాతంత్ర్యానికి విముఖులైన వారి సలహాలపైన పరిపాలన సాగిస్తారు. ఈ రెండు ఇబ్బందులు లేకుండా గాంధీగారు ఒక సూత్రం పన్నారు. మంత్రివర్గం చేసే తీర్మానాలనే పాటిస్తామనీ, తమకు సంవిధానం ద్వారా వచ్చిన హక్కును వినియోగించము అనీ గవర్నర్లు మాట యిచ్చే లాగున ఇంగ్లండులో ఉండే ఇండియా కార్యదర్శి ప్రకటించినట్లయితే, - ఆ ప్రకటనను అనుసరించి కాంగ్రెసువారు మంత్రివర్గాలు ఏర్పాటు చేస్తారని గాంధీగారు అద్భుతమైన, ఒక అహింసాత్మక సూచనను చేశారు. మూడు నెలలు ఆలోచించి బ్రిటిషు గవర్నమెంటువారు ఈ సూచనను అంగీకరించారు. దానిపైన, ఎనిమిది, తొమ్మిది రాష్ట్రాలలో కాంగ్రెసు ప్రభుత్వాలు ఏర్పాటు అయాయి. అ ప్రకారంగానే, చెన్నరాష్ట్రంలో కూడా గవర్నర్ కాన్‌స్టిట్యూషనల్ (Constitutional) గవర్నర్‌గా