పుట:Naajeevitayatrat021599mbp.pdf/595

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిస్తున్న తెలుగు నాయకులుకూడా ఒకరిద్దరు లేకపోలేదు. అందుచేత, ప్రకాశంగారు తప్పక ముఖ్యమంత్రి కాగలరు అన్న మొదటిభావం ఓ రెండు సూర్యాస్తమయాలు గడచేసరికి మెత్తబడి, పలుచబడి, నీరయి పోయింది.

నాయకుని ఎన్నుకోవలసిన దినం వచ్చింది. దానికి క్రితం రాత్రి తెలుగు సభ్యులు యావన్మంది మరొకమారు నాగేశ్వరరావుగారి మేడపైన సమావేశమై - ప్రకాశంగారు తప్పక పోటీచేయాలని కొందరూ, పోటీ చేసినట్లయితే గెలుపు అనుమానమని కొందరూ, అసలు తగాదాలు లేకుండా సామరస్యంగా ఏదో ఏర్పాటయితే బాగుంటుందని మరికొంత మంది (వీరంతా పెద్దలే) వివిధములయిన అభిప్రాయాలు వ్యక్తపరచి, తుది నిర్ణయం ప్రకాశంగారికి వదలివేశారు.

ప్రకాశంగారు తమ మనస్సులోని ఊహ ఎవరికీ చెప్పలేదు. ఏమి చెప్పగలరు? ఆంధ్రరాష్ట్రంలో వున్న ఇద్దరు పెద్దనాయకులే వై మనస్యం చూపించినట్టు తోచిన వేళ, ఏం మాట్లాడడానికీ వీలులేదు కదా! ఏది మాట్లాడినా కార్యం మరింత చెడిపోతుంది. మొత్తంమీద ఆ విధంగా ఆంధ్రులు ఆ రాత్రి ఒక అభిప్రాయానికి రాలేకపోవటం విచారకర మయిన విషయము. తెలుగువారి త్యాగధనమూ, పలుకుబడీ - భారతీయ రాజకీయాలలో అవరోహణ చేయడానికి ఆ రాత్రి కల్గిన సందిగ్ధావస్థే మొదటి మెట్టు.

మరునాడు ప్రకాశంగారే నాయకుని ఎన్నుకునే సభలో స్వయంగా రాజాజీ చెన్నరాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ నాయకుడుగా ఉండాలనే ప్రతిపాదన అనుమానంలేని గొతుకకతో చేశారు. సభలో ఉన్నవారు యావన్మందీ సంతోషించారు. కొన్ని సంవత్సరాల తరువాత తెలిసిన విషయం ఏమంటే - అది ప్రకాశంగారు, సాంబమూర్తిగారు మొదలైన ఒకరిద్దరు కలసి చేసుకున్న నిర్ణయమని, అది పరిస్థితుల వాస్తవికతపై ఆధారపడినదనీ తెలిసింది. అప్పుడు ప్రకాశంగారిని ఉపనాయకునిగా (డిప్యూటి లీడర్‌గా) రాజాజీ ప్రతిపాదిస్తారని ప్రకాశం, సాంబమూర్తి