పుట:Naajeevitayatrat021599mbp.pdf/591

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పక్కన కూచోమన్నారు. ఇతర ప్రసంగాలు చేయటానికి వ్యవధి లేకపోవడంచేత పటేలుగారు ప్రకాశంగారి అభ్యర్థిత్వ విషయమై ప్రశ్నించారు. వెంకటప్పయ్యగారు "ప్రకాశంగారు లేకుండా శాసన సభ ఎలా ఉండగలదు." అని తిరిగి ప్రశ్నించగా, రాజాజీ అసంతుష్టితో కొంచెం దూరంగా జరిగారు.

వెంకటప్పయ్యగారికి ప్రకాశంగారంటే పడనందున, ఆయన ప్రకాశంగారిని అభ్యర్థిగా నిర్ణయించ కూడదని తప్పక చెప్పగలరన్న అభిప్రాయంతో వెంకటప్పయ్యగారికి ప్రత్యేకంగా కబురంపి రాజాజీ రైల్వేస్టేషన్‌కి రప్పించారు. కాని, ఆయనకు ఆశాభంగం కలిగింది. వెంకయప్పయ్య గారు పెద్దవారు గనుక ఆ విధంగా తమ అభిప్రాయం తెలిపారు. ఆయనను ఏమనడానికి తోచక, "సరే, మీరు వచ్చిన పని అయింది. రైలు బయలుదేరుతూంది. మీరు వెళ్ళండి." అని వారిని పంపివేశారు.

ట్రెయిన్ రేణిగుంటకు వెళ్ళేసరికి శ్రీ మాడభూషి అనంతశయనం అయ్యంగారు రాజాజీ, పటేలు కూచున్న బండి ఎక్కడని అడుగుతూ ప్లాట్‌ఫారంలో అటూ ఇటూ తిరుగుతూ వెతుక్కుంటూ వచ్చారు. మొదట్లో ప్రకాశంగారి ముఖం ఆయనకు కనిపించింది. "ఏమయ్యా, అంత తొందరగా అటు ఇటు చూస్తున్నా?"వని ప్రకాశంగారు అయ్యంగార్ని అడిగారు. పటేలు గారిని కల్సుకోవాలని రాజాజీ తంతి యిచ్చినట్లూ, అందువల్ల ఆయనకోసం వచ్చినట్టూ అయ్యంగారు చెప్పారు. అప్పటికి అయ్యంగారు కేంద్ర శాసన సభలో సభ్యుడు. పటేలు కూచున్న కంపార్టుమెంటు ఎటున్నదో అయ్యంగారికి ప్రకాశంగారు చేత్తో చూపించారు. అయ్యంగారు అక్కడికి వెళ్ళేసరికి పటేలు అయ్యంగారికి ప్రత్యుద్ధానం చేసి ప్రక్కన కూచోమన్నాడు.

ఇక్కడ కూడా ఇతర ప్రసంగాలకు వ్యవధి లేనందువల్ల పటేలుగారు తటాలున అయ్యంగారిని "ప్రకాశంగారి అభ్యర్థిత్వం విషయమై ఏమిటి మీ అభిప్రాయం?" అని అడిగారు. అయ్యంగారు