పుట:Naajeevitayatrat021599mbp.pdf/588

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాష్ట్రీయ స్వపరిపాలన [ప్రొవిన్షియల్ అటానమీ] అనే నిర్వచనం ఉండేది.) ఈ కారణాలవల్ల ఆ ఆక్టుక్రింద జరగబోయే ఎన్నికలలో కాంగ్రెసువారు పాల్గొని జయం సాధించవలెనన్న నిశ్చయం ఒకటి అందరి పెద్దలకూ ఏర్పడింది. ఎటువచ్చీ ఎన్నికలలో గెల్చిన తర్వాత మంత్రి పదవులను స్వీకరించాలా, వద్దా అన్న విషయంపై మాత్రం కొంత సందేహం కలిగింది. ప్రకాశంగారు, సాంబమూర్తి గారు, నేను మొదలైనవారం మంత్రి పదవులను అవకాశ మున్నచోట తప్పక కాంగ్రెసువారు ఏర్పాటు చేయాలన్న అభిప్రాయంలో ఉండేవాళ్ళము. పై స్థాయిలో జవహర్‌లాల్ నెహ్రూ, మన ఆంధ్రస్థాయిలో డాక్టరు పట్టాభి సీతారామయ్యగారు మొదలైనవారు ఎన్నికలలో పాల్గొనవచ్చు గాని, మంత్రి పదవులను స్వీకరింపరాదన్న అభిప్రాయంలో ఉండేవారు. దీనికి కారణం - పూర్వ కాలంలో మోస్తరుగా మంత్రి పదవి, బ్రిటిష్ గవర్నమెంటువారు ఇచ్చేదనీ, అది మనం స్వీకరిస్తే ధర్మంక్రింద స్వీకరించి నట్టవుతుందనీ వారు భావించడమే.

నేను లక్నోలో 1936 లో జరిగిన ఏ. ఐ. సి. సి. సమావేశంలో ఉత్తరార్దమందు, మంత్రిపదవి స్వీకరించక కేవలం ప్రతిపక్షంగా కూర్చుని ఉన్నట్లయితే, - ఏ సమయంలో ప్రభుత్వం ఏర్పాటుచేసే మంత్రివర్గంతో సహకరించాలో, ఎప్పుడు సిద్ధాంతానికి వ్యతిరేకంగా తప్పటడుగు వేయవలసివస్తుందో తెలియక కాంగ్రెసు పార్టీవారు కలవరపడే స్థితిలో ఉండడమేకాక, వారి దృష్టి చెడిపోయే అవకాశం ఉంటుందనీ, బలం ఉండి ప్రతిపక్షంలో కూర్చునట్లయితే సముద్రం ఒడ్డున ఇసుకపైన పంట పండించడానికి ప్రయత్నించే విధంగా వృథా ప్రయాస అవుతందనీ; అందుకు తార్కాణంగా 1927 మొదలు 1930 వరకు చెన్నరాష్ట్ర శాసన సభలో కాంగ్రెసువారు చేసిన అవకతవక లన్నిటినీ ఉదహరించి ఏ. ఐ. సి. సి. సభ్యుల మనస్సులను పదవీ స్వీకరణమే మంచి దనేటట్లు మార్చడం జరిగింది. అయినా, అది రాబోయే డిసెంబరులో కాంగ్రెసు సాంవత్సరిక సభలో అంగీకారం పొందవలసి ఉండినది. ఈ లాగుననే, ఆంధ్రరాష్ట్రంలో జరిగిన ఆంధ్ర