పుట:Naajeevitayatrat021599mbp.pdf/587

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1

1937 లో శాసన సభ ఎన్నికలు

మొదటి కాంగ్రెసు మంత్రివర్గం గురించి, అనగా - 1937 జూలై పద్నాలుగవ తేదీ లగాయితూ 1939 సెప్టంబరు వరకూ రాజాజీ ఆధ్వర్యాన నడచిన ఉమ్మడి చెన్నరాష్ట్ర రాజకీయాలను గురించి సరిగా అవగాహన చేసికొనేటందుకు 1937 ఫిబ్రవరిలో జరిగిన జనరల్ ఎన్నికల విషయమై కొంత చెప్పవలసి ఉంది.

1921 లో కాంగ్రెసువారు ప్రకటించిన శాసన సభా బహిష్కార సూత్రంలో 1923 ఫిబ్రవరినుంచి క్రమంగా మార్పు వచ్చిన విషయం పాఠకులకు విదితమే. 1934 లో గాంధీజీ కాంగ్రెసు మూలసభ్యత్వం నుంచి విరమించుకోవడం, ఆ సంవత్సరం కేంద్ర శాసన సభ ఎన్నికలలో కాంగ్రెసు పాల్గొని ఎన్నో రాష్ట్రాలలో అఖండ విజయం సాధించి కేంద్ర శాసన సభలో ప్రధానమైన ప్రతిపక్షంగా ఏర్పాటు కావడంకూడా పాఠకులకు తెలిసినవే. ఈ కారణంచేత కాంగ్రెసువారి దృష్టి శాసన సభలపైన గట్టిగా పడింది. ఇంతేకాక, 1927 మొదలు 1930 వరకు, తర్వాత 1934 నుండి అప్పటివరకు శాసన సభా కార్యక్రమంలో ప్రతిపక్షంగా కాంగ్రెసు నాయకులు చూపిస్తూ వచ్చిన చురుకుదనాన్ని బట్టికూడా స్వరాజ్య సంపాదనకు శాసన సభలు ప్రధాన ద్వారాలన్న అభిప్రాయం అందరికీ కలిగింది.

ఇలా ఉండగా, 2 - 8 - 1935 వ తేదీన ఇంగ్లీషు పార్ల మెంటులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిల్లు, ఆక్టుక్రింద పాస్ అయి ఉండెను. ఈ ఆక్టుక్రింద, కేంద్ర ప్రభుత్వంలో, ప్రజలకు ఏవిధమైన అధికారమూ సంక్రమించక పోయినా, రాష్ట్రాలకు ఏర్పాటు చేసిన విషయాలలో మాత్రం కొంత స్వాతంత్ర్యం ఇవ్వబడింది. (దీనికే ఆ రోజులలో