పుట:Naajeevitayatrat021599mbp.pdf/577

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మార్గం తొక్కితే బాగుంటుంది" అన్నాడు. అంటే, ఆ వాక్యానికి ఏవిధంగా నయినా అర్థం చెప్పుకోవచ్చు నన్నమాట అంతేగాని, తిరిగి రాజ్యాంగాన్ని చేపట్టమని మాత్రం ఆ వాక్యానికి అర్థం కాజాలదు.

వ్యక్తి సత్యాగ్రహం చాలదు. సమష్టి సత్యాగ్రహాన్ని చేబట్టాలనీ అర్థం చెప్పుకోవచ్చు. కాని ఆయన అంతరంగంలో, తిరిగి అందరమూ, "మేము, మీ యుద్ధం విధానాలతో సహకరిస్తాం" అని ఆంగ్లేయులకు హామి ఇచ్చి, మళ్ళీ రాజ్యాంగాన్ని చేపట్టి, మంత్రిత్వం మొదలైన హోదాలలోకి పోవాలని ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

డా॥ రాజన్ స్టేట్‌మెంట్‌ను బాగా పరిశీలిస్తే, రాజాజీకి - గాంధీగారి దగ్గరకు వెళ్ళి, వారిని ఒప్పించడానికి శాయశక్తులా తంటాలు పడి, ప్రస్తుతం నడుస్తూన్న ఉద్యమం ఎంత "నిరర్థకంగా" తయారయిందీ తెలియపరచి, ఆయన్ని ఇంకా బలమయిన పద్ధతిని, తీవ్రమయిన శాసన ధిక్కార విధానానికి, అంటే సమష్టి సత్యాగ్రహానికీ, పూనుకునేటట్లు చేయాలని ఉన్నట్టు కనబడుతుంది. అందువల్ల, తిరిగి రాజ్యాంగాన్ని చేపట్టాలని ఉన్నట్టు అది అర్థాన్ని ఇవ్వకపోయినా, మనమంతా సర్దార్ శార్దూలసింగును అనుకరిస్తూ, గాంధీగారిని సవల్ చేయాలన్న భావం ఆ స్టేటుమెంట్‌లో పూర్తిగా ఉన్నట్టు ప్రపంచ ప్రజలకు అనిపించగలదని అనక తప్పదు.

17

ఆకాంక్ష

ఇల్లా నడిచింది నా చరిత్ర. ఈ 'నా జీవిత యాత్ర' ద్వితీయ, తృతీయ ఖండాలలో నేను దేశంలో రాజకీయంగా జరిగిన పోరాటాలలో ఎల్లా ఎల్లా పాల్గొని ఏయే మార్గాల దేశసేవ చేయడానికి మనోవాక్కాయాల ప్రయత్నించానో, పుట్టింది బీదల ఇళ్ళల్లోనూ - పెరిగిందీ అక్కడే అయినా, ప్రజల నుంచి లాయరుగా సంపాదించిన