పుట:Naajeevitayatrat021599mbp.pdf/576

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విఫలమయిందనీ, జనులు నిష్కారణంగా, ఏ ఒక్క క్రియాసాధనకూ పూనుకోకుండా, ఊసుబోక జెయిళ్ళకు వెళ్లారనీ అన్నారు.

జెయిళ్ళలో ఎటువంటి ప్రచారం జరిగినా, బయటకు వెళ్లేవారికి, రాజాజీ గ్రూపు వారెట్టి ప్రబోధం చేసిఉన్నా, ఆ ప్రబోధమంతా చెవిటివాడిముందు శంఖమే అయింది. బయటకు వెళ్ళిన వారంతా వారు ఇచ్చే స్టేట్‌మెంట్లు ద్వారానూ, ఉపన్యాసాల ద్వారాను - గాంధీగారినే మనస్ఫూర్తిగా అనుసరించాలి, వారి విధానాలే మనకు శరణ్యాలు అని చెప్పేవారు.

ఇది రాజాజీకి చాలా చికాకునీ, తలవంపునూ కలుగజేసింది. ఆయన బాధపడసాగాడు. ఆయన నాతో అన్నాడు కూడా. "ఏమిటి, బయటకు వెళ్ళినవాళ్ళకి బుద్ధీ, జ్ఞానం ఉన్నాయా లేదా? అదేమిటి, వాళ్ళంతా ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడుతున్నా"రని, పాపం, వాపోయాడు. వల్లభ్‌భాయ్ పటేల్ గారి ఉపన్యాసాన్ని చదివిన రాజాజీ, "ఏమిటిది? వల్లభ్‌భాయ్ పటేల్ కూడా ఇల్లా కలవరపడుతున్నాడేమి"టన్నాడు.

డా. రాజన్ స్టేట్‌మెంట్

జెయిళ్ళనుంచి బయటకు వెళ్ళిన వారంతా అనుసరిస్తూన్న పద్ధతులను గ్రహించయినా, వారంతా గాంధీగారినే ఆదర్శంగా పెట్టుకున్న పరిస్థితిని గ్రహించయినా, రాజాజీ, డా॥ రాజన్ వగైరాలు తమ అభిప్రాయాలను మార్చుకుంటా రనుకున్నాను. కాని విడుదల అయిన వెంటనే డా॥ రాజన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ చూస్తే ఆశ్చర్యం వేసింది. ఈ పెద్దమనిషి జెయిలు బయటకూడా, రాజాజీకి అనుగుణంగా, కలతలూ, కలవరపాట్లు తీసుకు రాదలచాడా అని తలచాను.

డా॥ రాజన్ స్టేట్‌మెంట్‌లో మేము తిరిగి రాజ్యాంగాన్ని చేపట్టమని లేదు. పైగా ఆయన ఏదో సందిగ్దంగానూ, ఆషామాషీగానూ అన్నదేమిటో తెలుసా? "ఏది ఎల్లా జరిగినా, మనం గాంధీగారిని వ్యతిరేకించ కూడదేమో!" అన్నాడు. ఆ స్టేట్‌మెంట్‌ను పూర్తిచేస్తూ చిట్టచివర వాక్యంగా ఆయన, "అయినా ఈ ఉద్యమం కొత్త