పుట:Naajeevitayatrat021599mbp.pdf/575

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చమురు అక్కరలేదు' అనే మిషతో వారి కోరిక తిరస్కరించబడిందని తెలిసింది.

మా కంటె ముందుగానే జెయిలుకు వచ్చిన శ్రీనివాసరావనే ఒక వ్యక్తి, వెల్లూరు జెయిలులో ఉన్న ఆ మొదటి వారం పదిరోజులలోనే, కాంట్రాక్టర్‌గారి విసురును డా॥ రాజన్‌గారి ముఖంమీదికి విసరగల అవకాశం లభించింది. శ్రీనివాసరావేమన్నాడంటే, "తమరు ఇన్‌స్పెక్టర్ - జనరల్ ఆఫ్ ప్రిజన్స్‌గా కాంట్రాక్టర్‌గారు చేసిన సూచనను జెయిళ్ళ మంత్రిగా తిరగతోడారు. బహుశ: మీరు, మీ జీవిత పర్యంతమూ, ఒక పాతిక సంవత్సరాలపాటు, మంత్రిగానే ఉంటామని తలచి ఉంటారు. పాపం, ఇప్పుడు తమరు ఏర్పరచిన రూల్స్ ప్రకారమే రాజఠీవితో బ్రతకడానికి వచ్చారు" అన్నాడు.

నేనూ కాంగ్రెసు గవర్నమెంటులో మంత్రినే అయినా ఈ విషయాలతో జరుగుతున్న దేమిటో నాకు తెలియదు. ఈ ప్రశ్న అందరి మంత్రుల అభిప్రాయాలూ సేకరించిన తరవాతనే తేల్చవలసి ఉంటుందని తలవబడి ఉండలేదు. అయినా, కాంగ్రెసు ప్రభుత్వం వారి ప్రతి చర్యకు మంత్రుల మందరమూ సమానంగా బాధ్యత వహించవలసి ఉందిగదా! ఈ తడవ లభించిన వెల్లూరు జెయిలు జీవితంలో మొదటి పదిరోజులలో మాకు కలిగిన అనుభవం ఇది. దర్మిలా, మమ్మల్ని మాకు అలవాటయిన ఆ పాతకొట్లలోకే మార్చారు.

బథిరశంఖ న్యాయం

తిరుచురాపల్లిలో గత పది మాసాలలోనూ మాకు కలిగిన అనుభవాలను గురించి చెప్పే ఉన్నాను. ఆరంభంలోనే డా॥ రాజన్, శ్రీమతి రుక్మిణీ లక్ష్మీపతి, రాజగోపాలాచారి మున్నగువారు గాంధీగారి నినాదాలను గాక రాజాజీగారి పద్ధతిని ఉత్తరాలు ఆయా యుద్ధసంఘ సభ్యుల కందజేసి జెయిళ్లకు వచ్చారని మనవిసేసే ఉన్నాను. అనగా ఒకరి ఆజ్ఞ ప్రకారంగా గాక, వారి ఇష్టానుసారంగా, వారు కోరుకున్న విధంగా వారు జెయిళ్ళకు వచ్చారన్న మాట! వారి ప్రచారం జెయిళ్ళలో కూడా సాగింప నారంభించారు. ఈ ఉద్యమం