పుట:Naajeevitayatrat021599mbp.pdf/570

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1930 ఉప్పుసత్యాగ్రహ దినాలలో లాగే ఇప్పుడూ డా॥ రాజన్ రాజగోపాలాచారిగారి ఆజ్ఞలనే పాటించారు. 1930 లో రాజగోపాలాచారిగారు తంజావూరు జిల్లా వేదారణ్యంలో ఉప్పుసత్యాగ్రహ సమరం ప్రారంభించారన్న సంగతి చదువరు లెరిగివున్నదే. శ్రీమతి రుక్మిణీ లక్ష్మీపతి కూడా అదే ప్రకారంగా రాజాజీగారి సూచనలను అనుసరించి, యుద్ధ సంఘ సభ్యులకు ఉత్తరాలు అందజేసి జెయిలుకు వచ్చింది. అదేప్రకారం రాజాజీగారి ఉత్తరువులనే పాటిస్తూ జెయిలుకు వచ్చిన తమిళులు చాలామంది వున్నారు. వారు, గాంధీగారి నినాదాల సంగతి ఎరిగో ఎరగకో తెలియదు గాని, రాజాజీగారి ఆజ్ఞలను పాలించారు.

రాజాజీ పట్టు

లోగడ చెప్పినట్లు, బాపినీడుగారు నవంబరు 23, 24 తేదీలలో బందరుకు తీసుకువచ్చిన ఉత్తరాలకు నకళ్లద్వారా రాజగోపాలాచారిగారి లేఖలు ఆంధ్రుల చేతులలోకి రహస్యంగా వెళ్ళాయి. డా॥ రాజన్, శ్రీమతి రుక్మిణీలక్ష్మీపతి గాక ఇంకా చాలామంది తమిళులు రాజాజీ ఆజ్ఞలనే పాలించడమూ, గిరిగారిని ఎల్లాగయినా తనవైపు తిప్పుకోవాలని రాజాజీ చేసిన ప్రయత్నమూ మున్నగునవి చూస్తే, గాంధీగారు తన కార్యక్రమాన్ని అంగీకరించక పోయినా, గాంధీగారి సూచనలకు వ్యతిరేకంగా రాజాజీ గారు ఏ విధంగానయినా తన పద్ధతి ప్రజలలో ప్రచారం కావాలనీ, తన పద్ధతే అందరూ అంగీకరించాలనీ అనేక విధాల ప్రయత్నం చేస్తూన్నట్లు కనబడింది.

ఆ సంగతి రాజాజీ స్వయంగా 1940 డిసెంబరులో సత్యాగ్రహం చేసినప్పుడు పూర్తిగా తేలిపోయింది. ఆయన తన ఉత్తరాలనే యుద్ధ సంఘ సభ్యులకు స్వయంగా యిచ్చి, తన్మూలకంగానే సత్యాగ్రహి అయ్యారు. రాజాజీ గిరిగారిని అధమం గాంధీగారి నినాదంలోని ఆఖరు పంక్తినయినా వదలమని మరీ మరీ బలవంతం చేయడం గమనిస్తే, వారికి అహింసాత్మక విధానంలో విశ్వాసం లేదనీ అర్థం అవుతోంది. అహింసాత్మక విధానంలో రాజాజీకి ఎంత నమ్మిక లేదో, గాంధీగారికి అంత ఎక్కువగా నమ్మకం వుంది. రాజాజీ, గాంధీగారి