పుట:Naajeevitayatrat021599mbp.pdf/563

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లయిన కాంగ్రెసు వారి నెవ్వరినీ ఈ రంగంలోకి రానివ్వడని చెప్పుకోసాగారు. కొందరు సన్నిహితులూ, కార్య నిర్వహణ దక్షులూ అయినవారి నోట విన్న వార్తలు ప్రజా హృదయాన్ని ఇంకా కుంగదీశాయి. ఈ ఉద్యమం యావత్తూ ఒక చిన్న టపాకాయిలా టప్పుమని ఎగిరి పోతుందన్నారు. ఆ అఖిల భారత చరఖా సంఘంతో సంబంధంవున్న వాళ్ళు - ఆ వడికేవాళ్ళూ, నేసేవాళ్ళూ, ఉద్యమాన్ని తుస్సుమనిపించకపోతే వేరే ఏం చెయ్యగల రన్నారు. ఎప్పుడూ గాంధీగారి విధానం అట్లాగే ఉంటుంది. కాంగ్రెసు శాసన సభ్యులనూ, మంత్రులుగా పనిచేసిన పెద్దలనూ జెయిళ్ళకు పంపించే లోపల ఆయన ఇటువంటి తమాషాలే చేస్తాడన్నారు. ఆశ్రమ వాసులతోపాటు అఖిల భారత కాంగ్రెసు కమిటీ మెంబర్లను కూడా జత చెయ్యడం ఆరంభించారు.

15

నినాదం గురించి వివాదం

ఎ. ఐ. సి. సి. అంటే భారతదేశపు ఉద్యోగేతర కాంగ్రెసు ప్రజాప్రతినిధి సభ (Un official congress parliament) అన్నమాట!

వివిధ రాష్ట్ర కాంగ్రెసు కమిటీలవారు పంపించిన జాబితాలను జాగ్రత్తగా పరిశీలించి, ఆ జాబితాల నుండి సరి అయిన, తనకు కావలసిన వ్యక్తులను ఎన్నుకుని గాంధీగారు ఉద్యమం సాగించాడు.

మేము 1941 నవంబరు 24 న బందరులో రాష్ట్ర కాంగ్రెసు కమిటీ మీటింగు జరిపాము. ఆ మీటింగులో మన ఆంధ్రరాష్ట్రానికి సంబంధించినంతవరకూ, దినానికి నలుగురయిదుగురి కంటె ఎక్కువగాని పద్ధతిగా ఈ సత్యాగ్రహం సాగించడానికి పదకం వేసుకున్నాము. ఆ అయిదుగురూ తలో జిల్లా, తలో తాలూకాకీ చెందేవారుగా ఉండేవారు. మేము బందరులో కలిసే లోపల, అయ్యదేవర కాళేశ్వరరావు గాంధీ