పుట:Naajeevitayatrat021599mbp.pdf/562

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీగారు వినోబా భావే తరవాత జవహర్‌లాల్ నెహ్రూ గజ్జెకడతా రన్నారు. అక్కడ చేరినవారి కెవ్వరికీ గాంధీగారి మనస్సులో ఉన్నదేమిటో తెలియదు. ఆయన కార్యక్రమం ఆయనకే తెలియాలి. ఎవరి తరవాత ఎవ్వరో, ఎప్పుడు ఎవ్వరికి పిలుపు వస్తుందో ఏమీ అర్థంగాని అయోమయ స్థితిలోనే సభ్యు లందరూ అలా ఉండి పోయారు.

గాంధీ అనుయాయుల అనుమానాలు

కొన్నాళ్ళపాటు ఈ ఉద్యమ విజయాన్ని గురించి అనేక అనుమానాలు వ్యక్తపరుప బడ్డాయి. ప్రభుత్వం వారు ముందు జాగ్రత్త కోసమని, సత్యాగ్రహం చెయ్యబోతున్నాడు గనుక జవహర్‌లాల్ నెహ్రూను అరెస్టు చేస్తున్నామని చెప్పి, ఆయన్ని నిర్భంధలోకి తీసుకున్నారు. నాలుగు సంవత్సరాల శిక్ష విధించ బడింది.

ఆ మర్నాడు పత్రికలలో ఒక స్టేట్‌మెంట్ వెలువడింది. అందులో నెహ్రూ తరవాత గాంధీగారి ఆశ్రమవాసులు ఇరవై నలుగురు సత్యాగ్రహం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారని తెలుప బడింది. ఈ ప్రకటన ఇంకా అనుమానస్పదమై, బహుశ: "ఈ ఉద్యమం ఇంతటితోటే" అనికూడా కొంద రనుకున్నారు.

గాంధీగారికి అతి సన్నిహితులూ, ముఖ్యులూ, ఆత్మీయులూ అనుకున్నవా రెవ్వరికీ గాంధీగారి హృదయం అర్థం కాలేదు. చిత్తరంజన్‌దాస్, లాలా లజపతిరాయ్‌ వంటి ప్రముఖులు కూడా గాంధీగారి హృదయం చాలా లోతయినదనీ, దానిని ఎప్పుడూ ఆయన విప్పిచెప్పరనీ, కార్య నిర్వాహక సభ్యులకుగూడా ఆయన హృదయం అర్థం కాదనీ, వారితోకూడా మనస్సు విప్పి తన అభిప్రాయం ఎప్పుడూ చెప్పలేదనీ వివరించారు. ఈ పట్టునకూడా గాంధీగారి అనుచరులకూ, ఆయనతో కలసి మెలసి పనిచేసే వారి కెవ్వరికీ కూడా ఆయన హృదయం అర్థం కాలేదు.

బయల్దేరిన పుకార్లలో, ఈ తడవ ఆయన నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న వారిని తప్ప, రాజకీయ రంగంలో నిమగ్ను