పుట:Naajeevitayatrat021599mbp.pdf/560

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆరంభం కానున్న వ్యక్తి సత్యాగ్రహం, ఆ వ్యక్తి సత్యాగ్రహం వినోబా భావే గారి నాయకత్వాన ఆరంభించడం రాజగోపాలాచారికి ఎంత మాత్రమూ ఇష్టంలేదు. వార్దాలో జరిగిన కార్య నిర్వాహక వర్గ సభకు నేను ప్రత్యేక ఆహ్వానంపై వెళ్ళాను. ఆ సభలో గాంధీగారు తాను అవలంభించ దలచిన కార్యక్రమ పద్ధతినంతా వివరించారు. ఈ యుద్ధ సమయంలో వ్యక్తి సత్యాగ్రహాన్నేగాని, సమష్టిసత్యాగ్రహాన్ని వాంఛించను అని ఆయన అన్నప్పుడు, ఆయన అభిప్రాయాన్ని అంగీకరించ డానికి వెనుకాడిన వారు కేవలం ఇరువురు మాత్రమే కనబడ్డారు.

వినోబా భావే నాయకత్వాన ఈ వ్యక్తి సత్యాగ్రహాన్ని ఆరంభించ నున్నానని గాంధీగా రనేటప్పటికి పెద్ద కలకలమే బయల్దేరింది. కొంతమందికి ఆయన ఎవరో తెలియదు. ఆయనకూ ఈ రాజకీయాలకూ ఉన్న సంబంధం ఏమిటో అసలు ఎవ్వరికీ తెలియదు. అందువల్ల ఆయన చేతిమీదుగా ఈ ఉద్యమం ఆరంభంకావడం అన్యాయమన్నారు. ఎన్నో త్యాగాలుచేసి జెయిళ్ళకు వెళ్ళిన హేమాహేమీ లనేకులుండగా ఈయన మీ కెక్కడ దొరికా డన్నారు. కాంగ్రెసు అధ్యక్షులుగానూ, కార్యనిర్వాహకవర్గ సభ్యులుగానూ సేవ చేసిన వారెవరూ పనికి రాలేదా అని అడిగారు. వినోబా భావేను మొదటి సత్యాగ్రహిగా నిశ్చయించే టప్పకి, గాంధీగారి అనుంగు శిష్యులూ, సదా ఆయన్ని అంటిపెట్టుకుని ఉండేవారూ, ఆ అయిదుగురూ కూడా అదేం పనండీ అని అడిగారు.

గాంధీగారు, ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటని రాజగోపాలాచారి గారిని అడిగితే, అసలీ కార్యక్రమమే అదోలా ఉందనీ, దేశీయు లెవ్వరూ దానిని ఆమోదించరనీ, ఈ ఉద్యమం పూర్తిగా నేలమట్టం అవుతుందనీ ఆయన అన్నాడు. నేను మాత్రం, మరేం పరవాలేదన్నాను. కార్య నిర్వాహకవర్గ సభ్యునిగా వారందరితోనూ కలసి మెలసి పనిచేసి ఉన్నందువల్ల, ఆ సభ్యులందరి ముందూ గాంధీగారితో అల్లా అనడానికి సాహసించాను. "ఇప్పటికి ఇరవై సంవత్సరాలుగా ఈ దేశానికి స్వాతంత్ర్యం సంపాదించాలని తమరు అన్నివిధాలా పాటుబడుతున్నారు. మీ యందూ, మీ పద్ధతియందూ అభిప్రాయ