పుట:Naajeevitayatrat021599mbp.pdf/559

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిందూదేశం విస్మరించలేదనీ, వారి అహింసాత్మక విధానంపట్ల ఎప్పుడూ సుముఖమేననీ, వారి అడుగుజాడలలో నడుస్తూ వారు ప్రారంభించిన, ప్రారంభించ బోయే ఏ విధమయిన శాసన ధిక్కార కార్యక్రమాని కయినా జోహారు లర్పిస్తూ, దక్షిణ దేశవాసులు సర్వదా సన్నద్ధులేననీ చెప్పాను. భాషాప్రయుక్త రాష్ట్రాల నన్నింటినీ సహకార నిరాకరణ ఉద్యమ ప్రారంభాలనుంచీ క్షుణ్ణంగా ఎరిగి ఉన్నవాడననీ, నేను మంత్రిత్వ హోదాలో పర్యటించిన రోజులలో ఆ రాష్ట్ర ప్రజల హృదయాలను పూర్తిగా అవగాహన చేసుకున్నానని, గాంధీగారి అడుగుజాడలలో నడుస్తూ, ఆయన ఆరంభించే అన్ని ఉద్యమాలలోనూ, ఆయన వెంట ఉండడానికి వా రెప్పుడూ తయ్యారనీ నొక్కి వక్కాణించాను.

ఇల్లా చెప్పినప్పుడు నా దృష్టిలో కేవలం ఆంధ్రదేశ మొక్కటే లేదు. ఈ రాష్ట్రంలోని భాషా విభాగాలన్నీ నా ఎదుట నిలచాయి. మాలో మాకు ఉత్పన్నమయిన అంత:కలహంలాంటి భేదాభిప్రాయ పరిస్థితులలో ఇచ్చిన ఈ నా ఉపన్యాసం దేదీప్యమానంగా వెలిగింది. [1]

ఈ సందర్భంలో ఇంత మాత్రమే దీనిని గురించి చెప్తాను. అది అయినా గాంధీ గారికీ, ఆయన విశ్వాస పాత్రులయిన ఆ అయిదుగురు అనుచరులకూ రాజగోపాలాచారి గారు తన స్వకీయమైన అభిప్రాయభేదాన్ని ఎల్లా వ్యక్త పరిచారో గ్రహించడానికే. ఆ అభిప్రాయాన్ని అనుసరించి, ఆయన కార్యనిర్వాహక సంఘ సభలోనూ, ఒక ఉద్యమం ఆరంభించడానికి సన్నాహ మవుతూన్న కాలంలోనూ, మేము జెయిళ్ళకు వెళ్ళాకా కూడా ఎల్లా మమ్మల్నీ, దేశాన్నీ చికాకుల్లో ముంచెత్తాడో గ్రహించడం కూడా న్యాయం.

భావే ఎన్నికకు నాయకుల అభ్యంతరాలు

బొంబాయి తీర్మానంపట్ల రాజగోపాలాచారిగారి మనస్సులో ఉన్న అనిష్టత ఆ విధంగా వ్యక్తం అయింది. గాంధీగారి ప్లానుప్రకారం

  1. ఈ ఉపన్యాసం ఆఖరు పేజీలో 'ఎపెండిక్స్‌" కింద ముద్రింపించ దలచారు.