పుట:Naajeevitayatrat021599mbp.pdf/558

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తీర్మానంలాంటిదే ఆమోదించబడిందన్న భావనే ఆయన్ని బాధ పెట్టిందని గ్రహించాను.

నా కీ విషయాలన్నీ బొంబాయి మీటింగుకు వెళ్ళిందాకా తెలియవు. గాంధీగారిని పూనా మీటింగులో కాదన్న ఆ పదిమంది పెద్దలే ఈ బొంబాయి మీటింగుకు ఆహ్వానకర్త లయ్యారు. అందువల్ల తర్జనభర్జన చెయ్యవలసిన అంశాలు అంతగా కనబడలేదు. బొంబాయి మీటింగులో గాంధీగారిని తిరిగి నాయకత్వం వహించమని కోరి, వారి అడుగుజాడలలోనే నడవాలి అన్న తీర్మానంపై మామూలు తర్జన భర్జనలూ, అవును కాదు అనే తర్కవితర్కాలు ఆ పదిమంది మధ్యనే జరిగాయి. ఈ తర్జనభర్జనలు జరుగుతూ ఉండగా, ఒకరు ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం అవడానికి రాజగోపాలాచారిగారే కారకులని ఆయన్ని దుయ్యబట్టుకున్నారు. ఆ కారణంగా రాజగోపాలాచారిగారు జవాబు ఇస్తూ, తాను తన స్వంత అభిప్రాయాన్ని వ్యక్తపరిచాననీ, ఈ రోజున కూడా అహింసా విధానంపై తనకు నిజంగా సదభిప్రాయం లేదనీ, కాంగ్రెసు ఆ అహింసాత్మక విధానానికి స్వస్తి చెప్పడమే తన వాంఛ అనీ అన్నాడు.

గాంధీగారికి నా హామీ

రాజగోపాలాచారిలాంటి వ్యక్తి అహింసావిధానంపై అట్టి అభిప్రాయం వెల్లడించినందుకు విచారిస్తూ, జనం హింసాత్మక విధానంవైపు మొగ్గుతున్నారని గ్రహించడాన్ని, నా మనోభావాన్ని వ్యక్తం చెయ్యడం న్యాయమని తలచాను. ముందుగా నేను మాటలాడుతానని గాని, మాటలాడవలసి వస్తుందనిగాని నేను భావించలేదు. అయినా, నాటి సభాధ్యక్షుడు నన్ను ఆఖరి ఉపన్యాసకునిగా నిర్ణయించారు. అందరి సభ్యుల అభిప్రాయాలను గ్రహించిన తరవాత మాటలాడగలగడం ఒక సదవకాశంగానే భావించాను.

దక్షిణ భారతదేశంలో ఉన్న పరిస్థితుల నన్నింటినీ ఆ బహిరంగోపన్యాసంలో వివరించాను. మనలోనే ఉన్న పంచమాంగ దళం వారి చర్యలు కూడా వివరించాను. గాంధీ గారిని ఎప్పుడూ దక్షిణ